విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని జగన్ లేఖ రాశారు .. మరి చంద్రబాబు ఏం చేశారు? అంబటి ఫైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం కొనసాగుతోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.

ఇదిలా ఉంటే విశాఖకు పోస్కో కంపెనీ రాబోతోందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుందని సీఎం జగన్ కు ముందే తెలుసని ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది .

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. ఆ విషయం చెప్పి చంద్రబాబుపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డివిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ .. ఆ విషయం చెప్పి చంద్రబాబుపై బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి

 చంద్రబాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ

చంద్రబాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు ధారాదత్తం చేసి లక్షల కోట్ల రూపాయలు కొట్టేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేస్తోందని టీడీపీ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో వైసీపీ నేతలు టిడిపి నేతలపై, ముఖ్యంగా చంద్రబాబుపై ప్రతి దాడికి దిగారు. అసలు చంద్రబాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైందని వైసిపి నేతలు మండిపడుతున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల పాలైందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు.

జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాశారు .. మరి చంద్రబాబు ?

జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాశారు .. మరి చంద్రబాబు ?

గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర సిద్ధమైనప్పుడు చంద్రబాబు అడ్డు చెప్పలేదని, ఆరోపించిన అంబటి రాంబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు అంబటి రాంబాబు. కేంద్రంతో సంబంధాలు ఉన్న పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే ప్రయత్నం చేయాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను పార్టీలకతీతంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు అంబటి రాంబాబు.

 చంద్రబాబు సుజనా స్టీల్ కోసమే ఇదంతా చేశారన్న అంబటి రాంబాబు

చంద్రబాబు సుజనా స్టీల్ కోసమే ఇదంతా చేశారన్న అంబటి రాంబాబు

జగన్ లక్షల కోట్లు కాజేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్న అంబటి రాంబాబు, చంద్రబాబుకు విమర్శించడం తప్ప మరేమీ తెలియదన్నారు. సుజనా స్టీల్ కోసమే ఇదంతా చంద్రబాబు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. సీఎం జగన్ ను పోస్కో ప్రతినిధులు కలిసిన స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించలేదని పేర్కొన్న అంబటి రాంబాబు, కొడుకు లోకేష్ కు చంద్రబాబు నిజాలు మాట్లాడడం నేర్పించాలని, కానీ అబద్దాలు చెప్పడం నేర్పుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

రాజకీయాలను పక్కనపెట్టి ఉద్యమించాలి

రాజకీయాలను పక్కనపెట్టి ఉద్యమించాలి

వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించటం తప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి బీజేపీ, టీడీపీలు ఏమీ చెయ్యటం లేదని విమర్శించారు అంబటి రాంబాబు .
ఇప్పటికైనా రాకీయాలను పక్కన పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని పేర్కొన్నారు . ఇక మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణా సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి . విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు.

English summary
Ambati Rambabu, who alleged that Chandrababu had not objected in the past when the Center was preparing for the privatization of the steel plant, said that CM Jaganmohan Reddy had already written a letter to the Center stating his clear stance. Ambati Rambabu asked Chandrababu to say what he had done to prevent the privatization of the steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X