• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీకి చంద్రబాబు:ముందే ఎమ్మెల్యే గణబాబు.. ఎల్జీ పాలిమర్స్ బాధితుల కొత్త డిమాండ్స్.. హీటెక్కిన విశాఖ

|

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ హైదరాబాద్ కు పరిమితమైపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టేందుకు రూట్ దాదాపుగా క్లియరైంది. సోమవారం వైజాగ్ వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాయగా.. ఏకంగా హోం మంత్రి నుంచే స్పందన రావడం గమనార్హం. తగిన రీతిలో అనుమతి కోరితే, చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించడానికి తమకెలాంటి అభ్యంతరమూ లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.

డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్‌తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..

వైజాగ్‌లో హడావుడి..

వైజాగ్‌లో హడావుడి..

రెండు నెలల తర్వాత టీడీపీ అధినేత ఏపీకి రానుండటం, అందునా తీవ్ర చర్చనీయాంశమైన ఎల్జీ పాలిమర్స్ ప్లాంటును ఆయన సందర్శించనుండటం, ఆర్ఆర్ వెంకటాపురంసహా బాధిత గ్రామాల్లో పర్యటించనుండటంతో టీడీపీ శ్రేణులు ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి. బాబు రాకతో వైజాగ్ లో మళ్లీ పొలిటికల్ హడావుడి హీటెక్కినట్లయింది. అధినేత రాకకు ఒక రోజు ముందే స్థానిక టీడీపీ నేత, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు అలియాస్ గణబాబు ఆదివారం బాధిత గ్రామాల్లో పర్యటించారు.

తమ్ముళ్లలో సంతోషం..

తమ్ముళ్లలో సంతోషం..

ఎమ్మెల్యే గణబాబు పర్యటన సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో జనం నుంచి వచ్చిన స్పందన చూసి తెలుగు తమ్ముళ్లు సంతోషంలో ముగినిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన ప్రతి చోటా జనం భారీగా గుమ్మికూడి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజలు చెప్పిన విషయాలను సావధానంగా విన్న గణబాబు.. అన్ని సమస్యలను చంద్రబాబుకు నివేదించి, పరిష్కారాల కోసం సీఎం జగన్ పై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. సోమవారం నాటి చంద్రబాబు పర్యటన కూడా ఇదే రేంజ్ లో హిట్ అయితే చాలాని తమలోతాము చర్చించుకున్నారు.

బాధితుల డిమాండ్లివే..

బాధితుల డిమాండ్లివే..


ఎల్జీ పాలిమర్స్ సంస్థ వల్ల మరోసారి ప్రాణనష్టం జరిగితే తట్టుకోలేమని, ఆ ఫ్యాక్టరీని వెంటనే వేరేచోటికి మార్పించాలని బాధిత గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేసినట్లు ఎమ్మెల్యే గణబాబు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బాధిత గ్రామాల్లోని ప్రజలందరూ ఇళ్లలో నిల్వ ఉంచిన బియ్యం, ధాన్యాలు, కిరాణ వస్తువులు సహా అన్నింటిని పారబోశారని, ఆ నష్టంతోపాటు దెబ్బతిన్న పండ్లు, కూరగాయల పంటలకు కూడా పరిహారం ఇప్పించాలని గ్రామస్తులు కోరారు. కొన్ని పశువులు చనిపోవడం, బతికున్నవాటి పాలు అమ్మే పరిస్థితి లేకపోవడంతో పాడి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే కోరికా వ్యక్తమైందని ఎమ్మెల్యే చెప్పారు.

  VizagGasLeak: Venkatapuram Villagers Dharna At LG Polymers Demanding Job for Every Family in Village
  గుబులు రేపిన గణబాబు..

  గుబులు రేపిన గణబాబు..

  వైజాగ్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన తర్వాత ఎమ్మెల్యే గణబాబు చేసిన కామెంట్లు టీడీపీలో దుమారం రేపాయి. గ్యాస్ లీకేజీ ప్రమాదానికి సంబంధించి గ్రౌండ్ లెవల్‌లో ఏం జరగుతుందో సీఎం జగన్ కు పక్కా సమాచారం ఉందని, ఇంటిలిజెన్స్ కాకుండా సొంత మార్గాల్లోనూ సీఎం సమాచారాన్ని తెప్పించున్నారని, మొత్తంగా ప్రమాదంపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందిన తీరు బాగున్నాయని కితాబిచ్చారు. దీంతో ఆయన కూడా వైసీపీలోకి జంప్ అయిపోతారంటూ ప్రచారం ఊపందుకుంది. అదంతా ఒట్టిదేనని కొట్టిపారేసిన టీడీపీ ఎమ్మెల్యే.. అధినేత చంద్రబాబు పర్యటనకు ముందే బాధిత గ్రామాల్లో పర్యటిస్తూ, శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు. కరోనా లాక్ డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ నిబంధనల నేపథ్యంలో బాబు విశాఖ పర్యటనపై గట్టి నిఘా ఉంటుందని సమాచారం.

  English summary
  as Chandrababu asks Andhra pradesh DGP to let him meet Vizag gas leak victims, tdp cadre preparing ground. Visakhapatnam West MLA P.G.V.Reddy Naidu alias Gana babu visits gas affected rr venkatapuram and other villages on sunday
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X