విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో ఢిల్లీకి జగన్: కార్మిక సంఘాలు కూడా: చంద్రబాబు సీక్రెట్‌గా ప్రేమ కలాపాలు: సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రతిష్ఠాత్మకమైన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రంలో రోజురోజుకూ ముదురుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు కారణమౌతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ అంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలను గుప్పిస్తోన్నారు. ప్రైవేటీేకరణకు జగనే సూత్రధారి అంటూ విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ త్వరలో ఢిల్లీ విమానం ఎక్కబోతోన్నారు. ఈ సారి ఆయన వెంట సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల నేతలు కూడా హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు.

రఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్‌కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథేరఘురామ రూటే సపరేటు: సాయిరెడ్డి, పవన్ కల్యాణ్‌కు సాధ్యం కానిది: ప్రధానితో భేటీ వెనుక పెద్ద కథే

 అనుబంధ కార్మిక సంఘాలతో కలిసి

అనుబంధ కార్మిక సంఘాలతో కలిసి


దీనికోసం తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొంతకాలంగా పోరాటం సాగిస్తోన్న 13 కార్మిక సంఘాల నేతలను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అన్నారు. వారికి ప్రధాని అపాయింట్‌మెంట్ దొరుకనప్పటికీ.. రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులను ప్రధాని కలుసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

చంద్రబాబు హయాంలో 56 కంపెనీలు ప్రైవేటుపరం..

చంద్రబాబు హయాంలో 56 కంపెనీలు ప్రైవేటుపరం..

కొద్దిసేపటి కిందటే ఆయన విశాఖలో జిల్లాకు చెందిన పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా కేంద్రంపై అన్ని రకాల ఒత్తిళ్లను తీసుకొస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు తన హయాంలో 56 ఫ్యాక్టరీలను ప్రైవేటీపరం చేశారని, అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రానికి చెందిన కంపెనీలను సైతం అమ్మేశారని, అప్పుడెవరూ అడ్డెందుకు చెప్పలేదని నిలదీశారు.

ప్రైవేటీకరణ కోసమే

ప్రైవేటీకరణ కోసమే

ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఎన్నిరకాలుగా అడ్డుకోవాలో అన్ని ప్రయత్నాలు చేస్తామని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు డ్రామాలను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే- దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కాచుకుని కూర్చున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. తమ పార్టీపై బురద చల్లడానికి దీన్ని ప్రైవేటీకరించాలనే ఆయన కోరుకుంటున్నారని ఆరోపించారు.

బీజేపీతో ప్రేమ కల్లాపాలు..

బీజేపీతో ప్రేమ కల్లాపాలు..

తాము నిర్వహించిన అఖిలపక్ష సమావేశాలనికి తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టీఎన్టీయూసీ) హాజరు కాకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పెద్దల కంట్లో పడటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో రహస్యంగా ఆయన ప్రేమ కలాపాలు సాగిస్తున్నారని చురకలు అంటించారు. ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునే అధికారం ఉన్న ప్రధాని మోడీకి తప్ప మిగిలిన వారందరికీ చంద్రబాబు లేఖలు రాస్తూ కూర్చున్నారని విమర్శించారు.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and other union leaders, who are associated with CPI, CPM, Congress likely to meet Prime Minister Narendra Modi soon on Vizag Steel Plant Privatisation proposals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X