• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేడు చంద్రబాబు..రేపు వైఎస్ జగన్: విశాఖ పాలిటిక్స్ గరంగరం: జేఏసీ నేతలతో భేటీ: హామీ?

|

విశాఖపట్నం: అయిదు దశాబ్దాల పాటు రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై రోజురోజుకూ నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఆందోళనలు తీవ్రతరమౌతోన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను నిరసిస్తూ వామపక్ష పార్టీల నాయకులు, అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన నిరవధిక నిరాహార దీక్షను పూనుకోనున్నారు. ఈ దీక్షలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించే ప్రయత్నం చేస్తోంది.

ఉక్కుపై పోటాపోటీ: వైసీపీ మరో పాదయాత్ర: తనను తాను కాపాడుకునే యత్నం?: పేరు ఫిక్స్

శారదా పీఠం వార్షికోత్సవాలకు..

శారదా పీఠం వార్షికోత్సవాలకు..

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విశాఖపట్నం పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం ఆయన విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు చినముషివాడలోని విశాఖ శారదా పీఠాన్ని ఆయన సందర్శించనున్నారు. శారదా పీఠం వార్షికోత్సవానికి హాజరు కానున్నారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులను పొందనున్నారు. పీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలంటూ కొద్దిరోజుల కిందటే స్వాత్మానందేంద్ర స్వామి.. జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే. రెండేళ్ల తరువాత శారదా పీఠాన్ని ఆయన సందర్శించడం ఇదే తొలిసారి అవుతుంది.

 ఇప్పటికే చంద్రబాబు..

ఇప్పటికే చంద్రబాబు..

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిరసన ప్రదర్శనలు సెగలు పుట్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య వైఎస్ జగన్.. సాగర నగరాన్ని సందర్శించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు విశాఖలో ఉన్నారు. పార్టీ నేత, మాజీ ఎమ్మెల్య పల్లా శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో.. ఆయనను కలిశారు. పరామర్శించారు. నిమ్మరసం తాగించి నిరాహార దీక్షను విరమింపజేశారు.

 ఇక వైఎస్ జగన్..

ఇక వైఎస్ జగన్..

వైఎస్ జగన్ కూడా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. వరుస ఉద్యమాలు, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న విశాఖపట్నంలో జగన్ చేపట్టబోయే పర్యటన ఎలాంటి భరోసాను ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.. చర్చనీయాంశమౌతోంది. జగన్ పర్యటననను తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం నేతలు, కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలతో స్వాగతం పలికే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై స్పష్టమైన ప్రకటన చేసేలా వారంతా జగన్‌పై ఒత్తిడిని తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగిస్తారనే చెబుతున్నారు.

 జేఏసీ నేతలతో భేటీ?..

జేఏసీ నేతలతో భేటీ?..

తన పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు నిరసనగా ఉద్యమిస్తోన్న ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జేఏసీ నేతలతో భేటీ కావడానికి జగన్ అంగీకరించారని, వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఈ పమావేశం సందర్భంగా- అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలను దేశ రాజధానికి తీసుకెళ్లే ప్రతిపాదనలను నాయకులు జగన్ ముందు ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. కార్మిక సంఘాల ప్రతినిధులతో ఢిల్లీలో ప్రధానితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతారని అంటున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy will visit Visakhapatnam on Febreaury 17th. He will participate in Visakha Sarada Peetam anniversary celebrations. He will likely to meet JAC leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X