విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా యూనివర్సిటీలో బయటపడ్డ డెన్: గుట్టలుగా కండోమ్ లు, సిరంజీలు, మందుబాటిళ్ళు.. అధికారులు షాక్!!

|
Google Oneindia TeluguNews

విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయా ? ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పెడదారిన పడుతున్నారా? యూనివర్సిటీ ప్రాంగణాన్ని విద్యార్థులు పాడు పనులకు వాడుతున్నారా అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక విషయాలు అవుననే అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి.

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక పొదల్లో డెన్

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక పొదల్లో డెన్

ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో కలకలం రేగింది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్ వెనుక యూనివర్సిటీ సుందరీకరణ భాగంలో దట్టంగా ఉన్న పొదలను, చెట్లను తొలగిస్తున్న క్రమంలో అక్కడ ఒక డెన్ బయటపడింది. అది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక దట్టంగా వెదురు చెట్లు పెరిగి ఉండడంతో, ఆ చెట్ల పైన ఒక డెన్ ను ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అయితే అక్కడ ఏం జరిగింది అన్న దానిపై చుట్టూ పరిసరాలను చూసినవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు .. వ్యభిచారం జరుగుతుందనే అనుమానాలు

గుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు .. వ్యభిచారం జరుగుతుందనే అనుమానాలు

పొదల మధ్య ఏకంగా డెన్ ఏర్పాటుచేసిన వాళ్లు ఓ మంచె, దానిపై పరుపు సెటప్ చేశారు. దాని పైకి ఎక్కడానికి ఒక నిచ్చెన ను కూడా ఏర్పాటు చేశారు. ఇక నిత్యం అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనంగా ఎక్కడ చూసినా గుట్టలుగుట్టలుగా కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు, సిరంజీలు, సిగిరెట్ ప్యాకెట్ లే కనిపించాయి. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ కండోమ్ ప్యాకెట్లు దొరకడం పలు అనుమానాలకు కారణంగా మారింది. ఇక్కడ ఈ డెన్ మాటున వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది.

డ్రగ్స్ కు కేంద్రంగా డెన్ .. సిరంజీలు, గంజాయి ఆనవాళ్ళు

డ్రగ్స్ కు కేంద్రంగా డెన్ .. సిరంజీలు, గంజాయి ఆనవాళ్ళు

అంతేకాదు ఈ పొదల దగ్గర మద్యం బాటిల్ లతో పాటుగా సిరంజిలు దొరకడం, గంజాయిని వినియోగించిన ఆనవాళ్లు కూడా కనిపించడంతో యూనివర్సిటీ అధికారులు షాక్ అయ్యారు. యూనివర్సిటీ లోపల డ్రగ్స్ వినియోగం జరుగుతుందన్న ఆందోళన సిరంజీలు కంటపడడంతో కనిపిస్తోంది. ఇక విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి యూనివర్సిటీ కూడా చేరుతుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఈ వ్యవహారం వెనుక యూనివర్సిటీ విద్యార్థులు కాక ఇంకేదో పెద్ద నెట్వర్క్ ఉందనే అనుమానాలు కూడా యూనివర్సిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

డెన్ ఏర్పాటు చేసింది.. దందా చేస్తుంది ఎవరు? విచారిస్తున్న అధికారులు

డెన్ ఏర్పాటు చేసింది.. దందా చేస్తుంది ఎవరు? విచారిస్తున్న అధికారులు

డ్రగ్స్ వినియోగానికి ఇంజెక్షన్లను తీసుకోవడానికి సిరంజ్ లను ఉపయోగించినట్టు అనుమానిస్తున్న యూనివర్సిటీ అధికారులు, అసలు ఈ డెన్ ఏర్పాటు చేసింది ఎవరు? ఎవరెవరికి ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయి అన్నదానిపై విచారణ చేస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లోపల సెక్యూరిటీ నిత్యం పహారా కాస్తున్నా ఇంత దందా ఎలా జరుగుతుంది? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అన్న దానిపై యూనివర్సిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

క్యాంపస్ లో డ్రగ్స్ ఎలా? ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా? అనుమానాలు

క్యాంపస్ లో డ్రగ్స్ ఎలా? ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా? అనుమానాలు

క్యాంపస్ లోకి మద్యం బాటిల్ లు ఎలా వచ్చాయి? డ్రగ్స్ ఎలా క్యాంపస్ లోకి వస్తున్నాయి? ఇక గుట్టలుగుట్టలుగా దొరికిన ఈ కండోమ్ ప్యాకెట్ల గుట్టు ఏంటి? వంటి అంశాలపై ఆరా తీస్తున్న అధికారులు యూనివర్సిటీలో తాజా పరిణామాలతో తలపట్టుకుంటున్నారు. ఇది కేవలం విద్యార్థులు చేసిన పనా లేక వీరి వెనక మరేదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అన్నది ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ లో కలకలంగా మారింది.

ఏది ఏమైనా విద్యాబోధన చేసి విద్యార్థులు తీర్చిదిద్దాల్సిన దేవాలయాలైన విశ్వవిద్యాలయాలు ఈ విధం గా మారడం హానికరమన్న భావన వ్యక్తమవుతోంది. మరి ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

English summary
A den has came to light in the bushes behind the Engineering College Boys Hostel at Andhra University. University officials were shocked to find hundreds of condoms, syringes and liquor bottles there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X