విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్వేది ఘటన : చంద్రబాబు హస్తం ఉందన్న విజయసాయి..మతాల పేరుతో విధ్వంసమన్న మంత్రి అవంతి

|
Google Oneindia TeluguNews

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపింది. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఘటన వెనుక టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన అనుచరుల హస్తం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై , లోకేష్ పై మండిపడిన విజయసాయి రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలు నాశనం చేయడం కోసం ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర గా అభివర్ణించారు.

అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !! అంతర్వేదిలో కొనసాగుతున్న 144 సెక్షన్: అడుగడుగునా పోలీసుల పహారా..రీజన్ ఇదే !!

సీబీఐ దర్యాప్తులో పెదబాబు, చినబాబుల హస్తం బయట పడుతుంది : విజయసాయి రెడ్డి

సీబీఐ దర్యాప్తులో పెదబాబు, చినబాబుల హస్తం బయట పడుతుంది : విజయసాయి రెడ్డి

చంద్రబాబునాయుడు ప్రవాసాంధ్రుడిలా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి అనుకుంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సిబిఐ దర్యాప్తును కోరామని చెప్పిన ఆయన త్వరలోనే పెదబాబు, చినబాబుల హస్తం బయట పడుతుందంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కావాలనే అంతర్వేదిలో ఘర్షణలు సృష్టించి, శాంతి భద్రతల విఘాతానికి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అని ఆయన అన్నారు.

గుంటూరు, హైదరాబాదు వ్యక్తుల ప్రమేయం ఉందన్న వైసీపీ ఎంపీ

గుంటూరు, హైదరాబాదు వ్యక్తుల ప్రమేయం ఉందన్న వైసీపీ ఎంపీ

అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనలో గుంటూరు, హైదరాబాదు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారని విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఘటనపై ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టడం కోసమే, ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవడం కోసమే సిబిఐ విచారణకు ఆదేశించామని విజయసాయి రెడ్డి అన్నారు. ఈరోజు విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన అంతర్వేది ఘటనపై స్పందించారు. అంతేకాదు రాజధాని విశాఖ పై కూడా మాట్లాడారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ హర్షణీయం : మంత్రి అవంతి

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ హర్షణీయం : మంత్రి అవంతి


విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో విశాఖ భూముల ధరలు బాగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే అవకాశమని భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే భూ ఆక్రమణలపై పలువురిపై కేసులు నమోదు చేసినట్లు గా, అరెస్టు చేసినట్లుగా తెలిపారు.

అంతర్వేది ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడం సంతోషకరమైన విషయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం పేర్కొన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్ర గా మంత్రి అభివర్ణించారు.

Recommended Video

Ease Of Doing Business లో Andhra Pradesh స్థానం పై TDP వ్యాఖ్యలు || Oneindia Telugu
మతాల పేరుతో విధ్వంసం సృష్టించే ప్రయత్నం అంటూ ఫైర్

మతాల పేరుతో విధ్వంసం సృష్టించే ప్రయత్నం అంటూ ఫైర్


రాష్ట్రంలో మతాల పేరుతో విధ్వంసం సృష్టించే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. చంద్రబాబు ట్రాప్ లో పడి పవన్ కళ్యాణ్ అమరావతి పై ప్రేమ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోని ఉందని కేంద్రం చెప్పిందని, విశాఖ పరిపాలన రాజధానిగా కచ్చితంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్వేది ఘటనపై కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అవంతి శ్రీనివాస్.

English summary
Chariot burnt incident at Antarvedi Sri Lakshminarasimhaswamy temple sparks outrage in Andhra Pradesh. The AP government has decided to launch a CBI probe into the incident. YSR Congress leader and Rajya Sabha member Vijayasai Reddy has alleged that TDP chief Chandrababu and his followers were behind the incident. Vijayasai Reddy, who was angry with Chandrababu and Lokesh, described it as a conspiracy by Chandrababu to destroy peace and security in the state. Minister Avanti Srinivas also reacted to the Antarvedi incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X