విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు జగన్ సర్కార్ మరో వరం: భీమిలీ టు భోగాపురం: ఇండస్ట్రియల్ క్లస్టర్?

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేయబోతోంది. మౌలిక సదుపాయాల కల్పన దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ, అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేసిన వేళ.. విశాఖపట్నానికి మరో వరాన్ని ప్రకటించింది.

వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలా వరద ఉధృతిలోనూ నో బ్రేక్: ఏపీ జీవనాడి నిర్మాణ పనులు చకచకా: జగన్ లక్ష్యాన్ని అందుకునేలా

భీమిలీ నుంచి భోగాపురం వరకు ఆరు/ఎనిమిది లేన్ల రహదారిని నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన టెండర్లను పిలిచింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నెలకొల్పబోతోంది ప్రభుత్వం. దీనికోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పనులను కొనసాగిస్తోంది. భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఇదివరకే కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

 AP government calls tenders for Bhimili-Bhogapuram 6 lanes road in Visakhapatnam

భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ఇప్పటికే 2,700 ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తయింది. జీఎంఆర్ ఈ విమానాశ్రయం నిర్మాణ పనులను దక్కించుకుంది. తాజాగా భోగాపురానికి రహదారిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ రహదారి నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. భీమిలీ నుంచి భోగాపురం వరకు ఆరు/ఎనిమిది లేన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రారంభ పనులను ప్రభుత్వం చేపట్టబోతోంది. భీమిలీ నుంచి భోగాపురం మధ్య దూరం సుమారు 28 కిలోమీటర్లు.

దీన్ని ఆరు లేన్ల రహదారిగా మార్చడం వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలవాసులకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అనుసంధానిస్తూ దీనికి రూపకల్పన చేసింది. దీనికి సమాంతరంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 360 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా మార్చాలనే ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

Recommended Video

Visakhapatnam : మధురవాడ కొమ్మాది సమీపంలో Quarantine Centre లో అగ్ని ప్రమాదం ! || Oneindia Telugu

డెంకాడ, ఆనందపురం, భీమిలీ పరిసర ప్రాంతాలను క్లస్టర్‌గా అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తరువాత.. శరవేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మూడు నుంచి మూడున్నరేళ్లలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈలోగా ఆరులేన్ల రహదారిని పూర్తిచేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Plans are a foot to develop a beach road from Visakhapatnam to Bhogapuram via Bhimili. Work is in progress to widen the new six-lane highway from Anakapalli to Anandapuram. If all these works are completed, the transport system to Bhogapuram will become a big asset.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X