విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు మరో వరం: రాయలసీమలో రెండు నగరాలకూ: ఉద్యోగావకాశాలకు ఊతం ఇచ్చేలా

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ఆవిర్బవించబోతోన్న సాగర నగరం విశాఖపట్నానికి మరో వరం లభించింది. ఈ నగరాన్ని జగన్ సర్కార్ కాన్సెప్ట్ సిటీగా అభివృద్ధి చేయబోతోంది. విశాఖతో పాటు రాయలసీమలోని అనంతపురం, టెంపుల్ సిటీ తిరుపతిని దీనికోసం ఎంపిక చేసింది. ఈ మూడు నగరాలనూ కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన శుక్రవారం వెలువడ్డాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

జగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కిజగన్ సర్కార్ ప్లాన్: అమరావతి భూములు అమ్మకానికి: సింగపూర్ కన్సార్టియం నుంచి వెనక్కి

ప్రభుత్వం కొత్తగా ఎంపిక చేసిన మూడు నగరాలు వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవే. రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ఏకీకృతం చేయడం, ఒకే చోట అభివృద్ధి చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కాన్సెప్ట్ సిటీలకు రూపకల్పన చేసింది. ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ల రంగం, దానికి అనుబంధ పరిశ్రమలన్నింటిని ఏర్పాటు చేయడానికి కాన్సెప్ట్ సిటీలు అనే కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చింది.

AP Government issued the orders for Ananthapur, Tirupati and Vizag as Concept Cities

ఇదివరకే దీనిపై వైఎస్ జగన్ మూడ, నాలుగు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. దీనికి అనుగుణంగా అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన పనులను పర్యవేక్షిస్తుంది. ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను నెలకొల్పడానికి ఎంపిక చేసిన ఆయా నగరాల్లో మొదట ప్రభుత్వం ఎనిమిది నుంచి 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అక్కడ ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తుంది.

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan

ఆయా చోట్ల పెట్టుబడులను పెట్టే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలను ఇస్తుంది. నీటి సౌకర్యం, రవాణా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో రాయితీలను ఇస్తుంది. పారిశ్రామిక విధానానికి అనుగుణంగా, దాని మార్గదర్శకాలకు లోబడి ఈ రాయితీలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ సిటీల వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయని, పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా- వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొంటోంది.

English summary
Andhra Pradesh Government headed by YS Jagan Mohan Reddy has issued the orders for Concept cities development in the State. Ananthapur, Tirupati and Visakhapatnam was selected for Concept Cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X