విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాక్ డౌన్ వేళ ఏపీలో ఓలా క్యాబ్ లకు అనుమతి - ఎక్కడంటే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ సందర్భంగా విధించిన లాక్ డౌన్ మాటున అత్యవసర కేసుల చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కరోనా కేసులతో ఆస్పత్రులు నిండిపోతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాన్ కోవిడ్ రోగులు మిగతా ఆస్పత్రులకు వెళ్లాలన్నా తగిన రవాణా సౌకర్యాలు కరవవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఓలా క్యాబ్ లను నాన్ కోవిడ్ రోగుల కోసం పరిమిత సంఖ్యలో నడుపుకునేందుకు షరతులతో అనుమతి ఇచ్చింది.

కరోనా ప్రళయం: 50 కోట్ల మంది పేదరికంలోకి! ఐక్యరాజ్యసమితి ఆందోళన, దేశాలకు పిలుపుకరోనా ప్రళయం: 50 కోట్ల మంది పేదరికంలోకి! ఐక్యరాజ్యసమితి ఆందోళన, దేశాలకు పిలుపు

లాక్ డౌన్ లో ఓలా క్యాబ్ లు..

లాక్ డౌన్ లో ఓలా క్యాబ్ లు..

ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మిగతా అత్యవసర రోగాలకు చికిత్స తీసుకుంటున్న రోగుల పరిస్ధితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వీరికి రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకని ప్రభుత్వం ఓలా క్యాబ్ లను పరిమిత సంఖ్యలో నడపాలని నిర్ణయించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ట్రయల్ బేసిస్ లో నడిపిన తర్వాత విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇస్తారు.

విశాఖలో పైలట్ ప్రాజెక్ట్..

విశాఖలో పైలట్ ప్రాజెక్ట్..


ఏపీ కొత్త రాజధాని విశాఖపట్నంలో ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ఓలా క్యాబ్ లను నాన్ కోవిడ్ ఎమర్జెన్సీలకు వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓలా యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం మన్నించింది. ఓలా విజ్ఞప్తిని రవాణా, పోలీసు శాఖలకు పంపిన ప్రభుత్వం... అధికారుల క్లియరెన్స్ మేరకు క్యాబ్ లకు అనుమతిస్తున్నారు.

 క్యాబ్ లలో ఎవరెవరు వెళ్లొచ్చంటే..

క్యాబ్ లలో ఎవరెవరు వెళ్లొచ్చంటే..

కరోనా కాకుండా డయాలసిస్, హార్ట్ , క్యాన్సర్ రోగులను ఇళ్ల నుంచి ఆస్పత్రులకు, తిరిగి ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఓలా క్యాబ్ లకు అనుమతి ఇచ్చారు. వీరితో పాటు వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది, డాక్టర్లకు ఆస్పత్రులకు వెళ్లేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు క్యాబ్ లను వాడుకునే అవకాశం ఇచ్చారు.

క్యాబ్ లలో ప్రత్యేక కేర్...

క్యాబ్ లలో ప్రత్యేక కేర్...

ప్రస్తుతానికి విశాఖపట్నం నగరంలో మాత్రమే నాన్ కోవిడ్ ఎమర్జెన్సీలకు, డాక్టర్లు, హెల్త్ కేర్ సిబ్బంది రవాణా అవసరాలకు మాత్రమే వాడే క్యాబ్ లకు ప్రత్యేక షరతులు విధించారు. ప్రతీ క్యాబ్ ను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. అలాగే ఒక్కో క్యాబ్ లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికి మాత్రమే అనుమతిస్తారు. వీరు కూడా మాస్కులు వేసుకుని, శానిటైజర్లు వాడుతూ ప్రయాణించాలని నిబంధనలు పెట్టారు.
క్యాబ్ ను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ఓలా యాజమాన్యం తీసుకోవాలని షరతు విధించారు.

English summary
after received a request from ola cabs, andhra pradesh govt decided to allow for non covid emergencies in visakhapatnam city on trial basis. state transport department announced that they have given permission to run ola cabs for non covid emergencies patients and their relatives from hospital to home. but limited the number of passengers to two only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X