విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతి త్వరలో విశాఖకు రాజధాని- సమాంతరంగా మరో సిటీ-ఐకానిక్‌ బ్రిడ్జ్‌-మంత్రుల క్లారిటీ

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రాజధాని విశాఖకు తరలిరావడం ఖాయమని, నగరానికి సమాంతరంగా మరో సిటీ రూపుదిద్దుకుంటుందని, అందులో ఐకానిక్‌ బ్రిడ్జ్‌ కూడా ఉంటుందని నిన్న ఒక్కరోజే ఇద్దరు మంత్రులు చేసిన ప్రకటనలతో రాజధాని తరలింపు, అనంతర వ్యూహాలు జోరుగా సాగుతున్నాయని అర్ధమవుతోంది. ఈ లెక్కన చూస్తే మార్చి తర్వాత ఏ క్షణాన అయినా రాజధాని తరలింపుతో పాటు ఇతర చర్యకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కూడా చెప్పేశారు.

Recommended Video

Andhra Pradesh : Amaravati Farmers Protest Reaches 400 Days | Oneindia telugu
రాజధాని తరలింపుపై మరింత క్లారిటీ

రాజధాని తరలింపుపై మరింత క్లారిటీ

ఏపీ రాజధాని తరలింపుకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వంలో కీలక స్ధానాల్లో ఉన్న మంత్రులు, సలహాదారులు రోజుకో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది వేసవి లోపే రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు అధికార గణం పూర్తిస్ధాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా మంత్రులతో పాటు సలహాదారులు చేస్తున్న వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కోర్టుల్లో నలుగుతున్న రాజధాని వ్యవహారం అతి త్వరలో తేలిపోతుందని ప్రభుత్వ పెద్దల్లో ధీమా కనిపిస్తోంది. దీంతో న్యాయపరమైన చిక్కులు దాటుకుంటూ రాజధానిని తరలిస్తామని వారు చెప్తున్నారు.

మరికొద్ది రోజుల్లో విశాఖ నుంచే పాలన అన్న అవంతి

మరికొద్ది రోజుల్లో విశాఖ నుంచే పాలన అన్న అవంతి


రాజధాని అమరావతి నుంచి మరికొద్ది రోజుల్లోనే విశాఖకు రానుందని తాజాగా నగరానికి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా త్వరలో పాలన ప్రారంభం కానుందన్నారు. తన నియోజకవర్గం భీమిలిలోని లక్ష్మీపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అవంతి ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అయిన అవంతి వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ విషయంలో దూకుడుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవంతి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశం వెలువడనుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.

విశాఖకు సమాంతరంగా మరో నగరం

విశాఖకు సమాంతరంగా మరో నగరం

త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పిన మంత్రి అవంతి.. అక్కడ ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి వ్యూహాలను కూడా వెల్లడించారు. అటు అనకాపల్లి, గాజువాక నుంచి ఇటు తగరపువలస, భోగాపురం వరకూ మెట్రో రైల్‌ ప్రాజెక్టు రాబోతుందని అవంతి తెలిపారు. అలాగే భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, ఎస్‌.కోట, డెంకాడ, భోగాపురం మండలాలతో విశాఖకు సమాంతరంగా మరో నగరం రూపుదిద్దుకోనుందని అవంతి వెల్లడించారు. దీంతో విశాఖపై వైసీపీ సర్కారు భారీ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

భీమిలి-భోగాపురం ఐకానిక్‌ బ్రిడ్జ్‌

భీమిలి-భోగాపురం ఐకానిక్‌ బ్రిడ్జ్‌

అదే సమయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్‌ నారాయణ విశాఖలోనే ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన శంకర్‌ నారాయణ మరో ప్లాన్‌ కూడా వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మంచబోయే కొత్త ఎయిర్‌పోర్టును విశాఖతో అనుసంధానించేందుకు రూ.1700 కోట్లతో బీచ్ కారిడార్‌ నిర్మిస్తామని శంకర్‌ నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా భీమిలి-భోగాపురం మధ్య ఐకానిక్‌ బ్రిడ్జి కూడా వస్తుందన్నారు. గోస్తనీ నదిపై 2.6 కిలోమీటర్ల పొడవున రూ.500 కోట్ల వ్యయంతో ఈ ఐకానిక్‌ వంతెన నిర్మిస్తామన్నారు. దీనికి డీపీఆర్‌ కూడా తయారవుతోందన్నారు.

English summary
andhra pradesh ministers avanthi srinivas ( muttamsetty srinivas ) and sankar narayana reveals state government plans to shifting capital to vizag and built parallel city, iconic bridge also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X