విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్ఐఏ విచార‌ణ సాగిస్తుందా: ఏపి అభ్యంత‌రాల వెనుక : రాజ‌కీయ కోణ‌మే కీల‌కంగా..!

|
Google Oneindia TeluguNews

జ‌గ‌న్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం పై ఏపి ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ముఖ్య‌మంత్రి మొదలు మంత్రుల వ‌ర‌కు ఇది ఏపి హ‌క్కుల‌ను గుంజుకోవ‌ట‌మ‌ని..స‌మాఖ్య స్పూర్తికి దెబ్బ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్ఐఏ కు ఏపి పోలీసులు స‌హ‌క‌రించ‌టం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, అస‌లు ప్ర‌భుత్వం దాడి జ‌రిగిన రోజు చెప్పిందేంటి..జరిగిందేంటి..అస‌లు విష‌యం ఇదేనా..

మా ప‌రిధి కాద‌న్నారు..మ‌రి, ఇప్పుడు..!

మా ప‌రిధి కాద‌న్నారు..మ‌రి, ఇప్పుడు..!

విశాఖ విమానాశ్ర‌యంలో అక్టోబ‌ర్ 25న జగ‌న్ పై దాడి జ‌రిగింది. ఆ దాడి జ‌రిగిన రోజు ముఖ్య‌మంత్రి మొద‌లు మంత్రు ల వ‌ర‌కు అంద‌రూ దాడిని ఖండించారు. అదే స‌మ‌యంలో..ఇది జ‌గ‌న్ సానుభూతి కోసం చేయించుకున్నార‌ని కొంద రు..సంచ‌ల‌నం కోసం దాడి జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, దాడి జ‌ర‌గ‌టం త‌మ ప్ర‌భుత్వంలో శాంతి భ‌ద్ర‌త‌ల వైఫ ల్యం కాద‌ని ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. విమానాశ్ర‌యం కేంద్ర బ‌ల‌గాల ప‌రిధిలో ఉంటుంద‌ని..

అక్క‌డ జ‌రిగిన దాడి తో రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం ఉండ‌ద‌ని స్ప‌ష్టంగా ఆ రోజే ప్ర‌క‌టించింది. కేంద్ర విమాన‌యాన..హోం శాఖ‌లు దీని పై విచార‌ణ‌కు ఆదేశించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇది ఆప‌రేష‌న్ గ‌రుడ లో భాగ‌మ‌ని విశ్లేషించారు. ఇక‌, జ‌గ‌న్ పై దాడి జ‌రిగిన త‌రువాత స్థానికంగా చికిత్స తీసుకోకుండా..ఫిర్యాదు చేయ‌కుండా వెళ్ల‌టాన్ని టిడిపి నేత‌లు త‌ప్పుబ‌ట్టా రు. దీని పై జ‌గ‌న్ ఆ త‌ర‌వాత వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ, ఇప్పుడు కోర్టులో కేసు కార‌ణంగా కేంద్రం తాము ఎన్ఐఏ విచార‌ణ కు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించి..కేసు అప్ప‌గించింది. ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం ఈ అంశాన్ని త‌ప్పు బ‌డుతోంది.

అభ్యంత‌ర‌క‌రం..బుర‌ద జ‌ల్లేందుకే..!

అభ్యంత‌ర‌క‌రం..బుర‌ద జ‌ల్లేందుకే..!

జ‌గ‌న్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్ప‌గించ‌టం అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని ఏపి ప్ర‌భుత్వం వాదిస్తోంది. ఇది రాష్ట్ర హ‌క్కుల ను గుంజెకోవ‌ట‌మేన‌ని..స‌మాఖ్య స్పూర్తికి విరుద్ద‌మ‌ని చెబుతోంది. దీని పై అప్పీల్ కు వెళ్లే ప్ర‌తిపాద‌న ఉంద‌ని..దీని పై ఆలోచ‌న చేసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఏపి ప్ర‌భుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ఎన్ఐఏ ఉగ్ర‌వాద కార్య క‌లాపాలు..విమానం హైజాక్ వంటి అంశాల‌కు ప‌రిమిత‌మైన సంస్థ అని విశ్లేషిస్తున్నారు. త‌మ ప‌రిధిలోని కేసు కాద‌ని నాడు చెప్పిన రాష్ట్ర ప్ర‌భుత్వం..నేడు రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ పూర్తి చేసిన త‌రువాత ఎలా ఎన్ఐఏ కు అప్ప‌గిస్తుంద ని ప్ర‌శ్నిస్తోంది. ఏపి ప్ర‌భుత్వం పై బుర‌ద జ‌ల్లేందుకే కేంద్ర ప్ర‌భుత్వం జ‌గ‌న్ ను అడ్డుపెట్టుకొంటోంద‌ని మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణ ఆరోపించారు. ఈ కేసు విచార‌ణ ద్వారా రాజ‌కీయంగా ఇబ్బందులు వ‌స్తాయ‌నే భావ‌న‌లో టిడిపి ప్ర‌భుత్వం ఉందా అనే అనుమానం ఈ వ్యాఖ్య‌ల కార‌ణంగా ఏర్ప‌డుతోంద‌ని వైసిపి నేత‌లు అంటున్నారు. అస‌లు.. కేసు ఎన్ఐఏకు ఇస్తే టిడిపికి న‌ష్టం ఏంట‌ని వైసిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్ఐఏ కు స‌హ‌క‌రించ‌టం లేదా..త‌రువాత ఏంటి..

ఎన్ఐఏ కు స‌హ‌క‌రించ‌టం లేదా..త‌రువాత ఏంటి..

ఎన్ఐఏ కు విశాఖ పోలీసులు స‌హ‌క‌రించ‌టం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ‌కు ప్ర‌భుత్వం నుండి అనుమ‌తి వ‌స్తే త‌ప్ప జ‌గ‌న్ పై దాడి కేసు వివ‌రాల‌ను ఇవ్వ‌లేని ఎన్ఐఏ అధికారుల‌కు విశాఖ పోలీసులు తేల్చి చెప్పిన‌ట్లు తెలుస్తోంది . కోర్టు ప్ర‌శ్నించ‌టం తో కేంద్రం ఈ కేసును ఎన్ఐఏ కు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎన్ఐఏ ఈ నెల 1న ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో కేసు డాక్యుమెంట్లను, రికా ర్డులన్నింటినీ చట్ట నిబంధనల మేరకు ఎన్‌ఐఏకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఎన్ఐఏ కు ఏపి ప్ర‌భు త్వం స‌హ‌క‌రిస్తుందా లేదా అనే సంశ‌యం మొద‌లైంది. ఇప్ప‌టికే కేంద్రం పై పోరాటం పేరుతో రాజ‌కీయంగా అనేక ఆరోప‌ణ‌లు చేస్తున్న త‌రుణంలో..ఈ అంశంలో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దాని పై ఏపి ప్ర‌భుత్వం మ‌ల్ల గుల్లాలు ప‌డుతోంది. ఒక వైపు సిబిఐ ని రాష్ట్రంలోకి వ్య‌తిరేకిస్తూ..ఇలా, ఎన్ఐఏ కు స‌హ‌క‌రిస్తే ఎటువంటి సంకేతాలు వెళ్తాయ‌నే దాని పై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఇప్పుడు ఏపి ప్ర‌భుత్వం ఈ అంశంలో ఎలాంటి వైఖ‌రితో ముందుకు వెళ్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది..

English summary
Visaka police not support NIA over attack on jagan case. Ap Govt also objecting NIA investigation. Now, this issue become political controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X