విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

APSET-2020:లెక్చరర్లు, ప్రొఫెసర్ల అర్హత పరీక్షకు ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదల

|
Google Oneindia TeluguNews

ఏటా వివిధ జూనియర్ కాలేజీలు యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ సెట్ నోటిఫికేషన్‌‌ను ఆంధ్రా యూనివర్శిటీ విడుదల చేసింది. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీ సెట్ -2020 అర్హత పరీక్షకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక ఈ పరీక్ష ఈ ఏడాది డిసెంబర్ 6న నిర్వహించనున్నట్లు ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Recommended Video

APSET-2020 నోటిఫికేషన్ విడుదల | Oneindia Telugu

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగష్టు 14వ తేదీన ప్రారంభం కానుండగా పూర్తి వివరాలతో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు చివరితేదీ 19 సెప్టెంబర్ 2020. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు andhrauniversity.edu.in , apset.net.in లో పొందుపర్చినట్లు నోటిఫికేషన్‌లో ఉంది. ఇక ఏపీ సెట్‌కు అప్లయ్ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సంబంధిత పీజీ సబ్జెక్టుల్లో 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

APSET-2020 notification released by Andhra university

ఇక పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా ఏపీ సెట్‌కు అప్లయ్ చేసుకుని పరీక్షకు హాజరుకావొచ్చు. ఒకవేళ పరీక్షలో క్లియర్ అయితే పీజీ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఏపీ సెట్-2020కి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1200 ఉండగా బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.700గా నిర్ణయించడమైంది.

పరీక్ష పూర్తి వివరాలు , అర్హత, సిలబస్, టెస్టు సెంటర్లు, ఇతర సూచనలు, అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో జాప్యం జరిగితే అపరాద రుసుము ఇతరత్ర విషయాలన్నీ పైన తెలిపిన వెబ్‌సైట్‌లో పొందుపర్చడం జరిగింది. ఇక ఏపీ సెట్ -2020 ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 14 ఆగష్టు 2020

అపరాద రుసుం లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2020

English summary
Andhra University released notification for APSET-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X