విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గు తెచ్చుకో సోదరి, ఎవరో అందరికీ తెలుసు: టీడీపీ అనిత కౌంటర్, తుగ్లక్ పాలన అని

|
Google Oneindia TeluguNews

వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత.. నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇల్లు అలకగానే పండగ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అదేరీతిలో రిప్లే ఇచ్చారు. సామెత మీకంటే ఎవరికీ బాగా తెలుసు అని అటాక్ చేశారు. 15 నెలల్లో 70 సార్లు ఇల్లు అలికారని గుర్తుచేశారు. రాజధాని మార్పుపై కోర్టు మొట్టికాయలు వేసి మరీ... పండగ కాదు అని చెప్పింది కదా అని సెటైర్ వేశారు.

సిగ్గు తెచ్చుకో సోదరి..

మరో నెటిజన్ కులాల గురించి కామెంట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి కులాల పేరుతో ఎలా మాట్లాడతారని ఫైరయ్యారు. సిగ్గు తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుల రాజకీయాలు మానేయాలని హితోపదేశం చేశారు. దీనిపై అనిత స్పందిస్తూ..ఎవరికీ చెబుతున్నావు అని మొదలు పెట్టారు. ఎన్నికల కమిషనర్ సామాజిక వర్గం ప్రస్తావన తీసుకొచ్చిన వారికా అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌కు కూడా కులం మరక వేసి ఆనందం పొందిన వాళ్లకా అని తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు.

తుగ్లక్ పాలన ఇలా..?

తుగ్లక్‌కి సంబంధించి అనిత వీడియో పోస్ట్ చేశారు. రాజధాని మార్పుకి సంబంధించి కామెంట్స్ ఉన్నాయి. అయితే ఓ నెటిజన్ ఒక డాగ్స్‌ని మరో డాగ్స్ స్క్రోలింగ్ చేస్తున్నట్టుంది అన్నారు. దీనికి అనిత డాగ్ అనాలని, స్క్రోలింగ్ కాదు ట్రోలింగ్ అనాలని చెప్పారు. ఒక లైన్ రాస్తే మూడు తప్పులు.. రూ.5 బ్యాచ్ పాస్ అవ్వట్లేదు అని దుమ్మెత్తిపోశారు. పాలన రాదు.. విమర్శ తీసుకోవడం రాదు.. సంస్కారం అంతా కన్నా లేదు అని మండిపడ్డారు.

అణాకానీ వని తెలియదు.. తప్పు నాదే..

మరో నెటిజన్ అనిత లక్ష్యంగా.. ఎవరూ మేసేజ్ పెట్టిన రిప్లే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని కామెంట్ చేశారు. దీనికి ఆమె తనది తప్పే.. కానీ అణాకానీ వని చెప్పేదాక తెలియక రిప్లై ఇచ్చా అని చెప్పారు. ట్వీట్‌లో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని.. ఖాళీగా ఉన్నప్పుడు వయోజన విద్య కార్యక్రమంలో చెబుతానని తెలిపారు.

Recommended Video

Pydikondala Manikyala Rao: కరోనాతో మృతి చెందిన Former Minister & BJP Leader Manikyala Rao

15 నెలల నుంచి ఇక్కడే ఎందుకు..?

వసతలు లేకపోయిన రాజధాని దేశానికి మధ్యలో ఉండాలని తలచివనాడు తుగ్లక్.. అమరావతి రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉంది అని వసతులు లేకపోయినా ఇక్కడే ఉండాలని తీర్మానించింది చంద్రబాబు అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఎవరు బాబు తుగ్లక్ అని పోస్ట్ చేయగా.. సెక్రటేరియట్, అసెంబ్లీ, మండలి ఎక్కడుంది అని అనిత ప్రశ్నించారు. మీ ఫెవరేట్ హైకోర్టు ఎక్కడ ఉంది అని అడిగారు. జగన్ ప్యాలస్ కూడా ఎక్కడ అని కొశ్చన్ చేశారు. అయినప్పటికీ 15 నెలల నుంచి ఇక్కడే ఎందుకు పాలన చేస్తున్నారు అని అడిగారు.

English summary
ashamed sister: tdp woman leader counter attack to netizen for comments. one person ask to her cast politics are ashamed, who is known all anithe reply
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X