విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్! టీడీపీకి అద్దె మైక్‌లా కాదు, అలా చెయ్యి: మంత్రి అవంతి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, టీడీపీ నేతలపై ఏపీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో జరిగిన దోపిడీ ఎక్కడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మంగళవారం మాట్లాడారు.

దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్‌బై! కారణాలివే..!దగ్గుబాటి షాకింగ్ నిర్ణయం: వైసీపీతోపాటు రాజకీయాలకు గుడ్‌బై! కారణాలివే..!

టీడీపీకి అవంతి సవాల్

టీడీపీకి అవంతి సవాల్

ఇప్పుడు టీడీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారని.. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుకను ఎలా దోచుకున్నారో తన దగ్గర లెక్కలున్నాయన్నారు. దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు మంత్రి అవంతి శ్రీనివాస్.

పవన్ కళ్యాణ్ అద్దె మైక్‌లా కావొద్దు..

పవన్ కళ్యాణ్ అద్దె మైక్‌లా కావొద్దు..


ఇక పవన్ కళ్యాణ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. జనసేనను టీడీపీలో కలిపేయాలంటే కలిపేసుకోండని అన్నారు. కానీ, టీడీపీకి అద్దె మైక్‌లా మాట్లాడవద్దని అవంతి శ్రీనివాస్ సూచించారు. టీడీపీ నేతల అవినీతి మీకు ఎందుకు కనిపించడం లేదని మంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.

ఎన్టీఆర్ తర్వాత జగనే..

ఎన్టీఆర్ తర్వాత జగనే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా మహిళలే కారణమని పర్యాటక శాఖ మంత్రి అవంతి అన్నారు. ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా.. ఏర్పాటు చేయాలన్నా మహిళా శక్తి కీలకమని వ్యాఖ్యానించారు. ఏపీ సమస్యలపై పార్లమెంటులో ఎంపీ విజయసాయి రెడ్డి ఒక్కరే మాట్లాడారని అన్నారు. విజయసాయి రెడ్డి నేతృత్వంలో విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అన్నారు. అంతేగాక, ఎన్టీఆర్ తర్వాత ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురించిన తెలుగు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

మహిళలు వార్తా ఛానళ్లు చూడాలి..

మహిళలు వార్తా ఛానళ్లు చూడాలి..

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 80 శాతం హామీలను జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు నెలల్లోనే చేసి చూపించారని అన్నారు. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశమిచ్చినా ఎన్ని హామీలు నెరవేర్చారో తెలుపాలంటూ నిలదీశారు. సంపూర్ణ మద్యపాన నిషేధంతో మహిళల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అవంతి అన్నారు. మహిళలు వార్తా ఛానళ్లు చూడాలని.. అప్పుడే నిజాలు తెలుస్తాయన్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయని అన్నారు.

English summary
Andhra Pradesh minister Avanthi Srinivas fired at Janasena President Pawan Kalyan and tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X