తాట తీస్తామంటున్నారు..మాకు చేతకాదా: ఇలాగే మాట్లాడితే రాష్ట్రంలో తిరగలేరు: పవన్ కు అవంతి హెచ్చరిక..!
విశాఖ లాంగ్ మార్చ్ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శల పైన మంత్రులు..వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ అజ్ఞాతవాసి కాదని..అజ్ఞాన వాసి అంటూ విమర్శించారు. విశాఖ సభలో వైసీపీ నేతలను తాట తీస్తామంటూ సినిమా డైలాగుతో పవన్ హెచ్చరించారని..మాకు తాయ తీయటం రాదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు..బెదిరింపులకు దిగితే రాష్ట్రంలో పవన్ తిరగలేరనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కాపులు అంటే పవన్ మాత్రమేనా..మరెవరూ లేరా అని నిలదీసారు. కాపుల్లో మీరు తప్పితే మరెవరూ పైకి రాకూడదా అని పవన్ ను ప్రశ్నించారు. జగన్ పైన సోనిమా..చంద్రబాబు పైన కేసులు పెట్టారని.. అవి దొంగ కేసులంటూ ప్రజలు 151 సీట్లు గెలిపించి..ముఖ్యమంత్రిగా చేసి తేల్చి చెప్పారని వివరించారు. ఒక్క సినిమా రెమ్యూనరేషన్ భవన నిర్మాణ కార్మికుల కసం పవన్ కళ్యాణ్ ఇవ్వలేరా అని మంత్రి అవంతి ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్! టీడీపీకి అద్దె మైక్‌లా కాదు, అలా చెయ్యి: మంత్రి అవంతి తీవ్ర విమర్శలు
తాట తీయటం మాకు చేతకాదా..
పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన లాంగ్ మార్చ్..సభలో చేసిన వ్యాఖ్యల మీద మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చెబితే ఏ ఒక్కరూ భయపడరని చెప్పుకొచ్చారు. పవన్ అజ్ఞాతవాసి కాదని..అజ్ఞాన వాసి అంటూ విమర్శించారు. తాట తీస్తామంటూ పవన్ అంటున్నారని..తాట తీయటం తమకు రాదా అని అవంతి ప్రశ్నించారు. విశాఖలో అయ్యన్న..అచ్చెన్న లేకుండా పవన్ ప్రశ్నించలేరా అని నిలదీసారు. అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకొని ఇసుక గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ..శ్రీకాకుళంలో ఇసుక అక్రమంగా దోచుకుంది అచ్చెన్న అంటూ విమర్శించారు. రెండు కిలో మీటర్లు నడవలేకపోయిన మీరు..పోలీసులను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. దేశంలో ఎంతో మంది పైన రాజకీయంగా వేధింపుల్లో భాగంగా కేసులు పెట్టారని అందులో భాగంగా జగన్ మీద కేసులు పెట్టారని అవంతి వివరించారు. చంద్రబాబు ట్రాప్ లో పవన్ పడ్డారని..ఎవరినైనా వాడుకొని వదిలేసే నైజం చంద్రబాబుదని అవంతి మండిపడ్డారు. చంద్రబాబు అజెండాను పవన్ మోస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.

కేసులున్నప్పుడే ప్రజలు గెలిపించారు.
జగన్ కేసుల గురించి పవన్ మాట్లాడుతున్నారని..జగన్ మీద పెట్టినవి అక్రమ కేసులని ప్రజలు నమ్మారని అవంతి చెప్పుకొచ్చారు. రెండు చోట్ల పోటీ చేసినా ప్రజలు తిరస్కరించిన విషయం మర్చి పోవద్దని గుర్తు చేసారు. కేసుల్లో ఉన్న సమయంలోనే జగన్ ను ప్రజలు 151 సీట్లతో గెలిపించి ముఖ్యమంత్రిని చేసారని వివరించారు. చిరంజీవి కష్టపడి పైకి రాలేదా..అదే విధంగా బొత్సా..కన్నబాబు పైకి వచ్చారని చెప్పారు. కాపుల్లో మీరు తప్పితే ఎవరూ పైకి రాకూడదా.. కాపులు అంటే మీరేనా ..ఇంకా ఎవరూ లేరా అని నిలదీసారు. పార్టీ నడపటం కోసం సీనియర్ల సలహాలు తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు..హెచ్చరికలు చేస్తే రాష్ట్రంలో తిరగలేరంటూ పవన్ ను అవంతి హెచ్చరించారు. వైసీపీ నేతలను వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసారు. పవన్ చేస్తున్న రాజకీయం మొత్తం చంద్రబాబు ప్రయోజనాల కోసమేనని..కాపు యువత ఆలోచన చేయాలని సూచించారు. ఎవరి కోసం పార్టీ పెట్టావు..అమ్ముడపోయా వంటూ అందరూ చెప్పుకుంటున్నారని అవంతి పేర్కొన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడి కుట్ర రాజకీయాలు చేయవద్దని సూచించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!