• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మలేసియాలో ప‌స్తులుంటున్న విశాఖ యువ‌కులు: ఆదుకున్న ట్రేడ్ యూనియ‌న్‌!

|

విశాఖ‌ప‌ట్నం: కొన్ని రోజులుగా ఓ ఇరుకు గ‌దిలో త‌ల‌దాచుకుంటూ, ప‌స్తులు ఉంటున్న విశాఖ‌ప‌ట్నం జిల్లాకు చెందిన న‌లుగురు యువ‌కుల‌కు అండ దొరికింది. మ‌లేసియాలోని భార‌తీయ స్వేచ్ఛా వాణిజ్య సంఘాల స‌మాఖ్య వారికి చేయూత‌ను అందించింది. బాధితుల‌ను స్వ‌దేశానికి పంపించ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది. జీవనోపాధిని వెదుక్కుంటూ విశాఖప‌ట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన మరిశా వెంకునాయుడు, మరిశా మహేష్‌, మరిశా గిరీష్‌, మరిశా శ్రీనివాసరావు, మరిశా గోవింద్‌, జామి నూకరాజు అనే యువకులు కొద్దినెలల కిందట మలేసియాకు వెళ్లిన విషయం తెలిసిందే.

విశాఖ శివార్లలోని గాజువాకకు చెందిన కర్రి శ్రీను అనే ఏజెంట్ వారిని మలేషియాకు పంపించాడు. మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని అత‌ను రాజాం యువ‌కులను న‌మ్మించాడు. వారి వ‌ద్ద నుంచి 60 వేల రూపాయ‌ల చొప్పున వ‌సూలు చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో బాధిత యువ‌కుల‌ను టూరిస్టు విసాపై మలేషియా తీసుకువెళ్లాడు.

CFTUI will help those Visakha Youths, who stranded in Malaysia with out Passport

త‌మిళ‌నాడుకు చెందిన ధనశేఖర్‌ అనే మరో ఏజెంట్‌కు వారి బాధ్య‌త‌ల‌ను అప్పగించాడు. కొట్టిన కొబ్బరికాయ చిప్ప ఎగిరిపడి.. ఎంబీఏ విద్యార్థిని మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు మ‌లేషియాకు వెళ్లిన రాజాం యువ‌కుల‌కు ఉపాధి క‌ల్పించ‌లేదు. రెండు నెల‌లైన‌ప్ప‌టికీ చేయ‌డానికి ఎలాంటి ప‌నులు లేవు. ఫ‌లితంగా- వెంట తెచ్చుకున్న డ‌బ్బులు అయిపోయాయి.

ఈ ఆరుమందినీ ఓ అపార్ట్‌మెంట్‌లోని చిన్న గదిలో ఉంచి నిత్యం నరకం చూపిస్తున్నారు ఆ దుర్మార్గులు. ఆ బాధలు పడలేక మరిశా గోవింద్, జామి నూకరాజు ఏజెంట్ల బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని స్వదేశానికి తిరిగి వ‌చ్చారు. మ‌రో నలుగురు అక్కడే ఉండిపోయారు. తాజాగా వీసా గడువు కూడా ముగిసిపోవడంతో నలుగురు యువకులు స్వదేశానికి రావ‌డానికి ప్రయత్నాలు చేయగా మలేషియా ఏజెంట్ వారి పాస్‌పోర్టులను లాక్కుని చింపేశాడు. వారు బయటకు వస్తే తమ బండారం బయటపడుతుందన్న ఆందోళనలో ఆ నలుగురిని అక్కడే బంధించాడు.

CFTUI will help those Visakha Youths, who stranded in Malaysia with out Passport

సరిగ్గా భోజనం కూడా పెట్టకపోవడంతో చిరుతిళ్లు, నీళ్లు తాగి కాలం వెళ్లదీస్తున్నారు. మరిశా వెంకునాయుడు, మహేష్‌ ఇద్దరూ అన్నదమ్ములు. తమ ఇద్దరు పిల్లలు మలేసియాలో దీన‌స్థితిలో కాలం వెల్ల‌దీస్తున్న విష‌యాన్ని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. మలేసియాలో చిక్కుకున్న యువకులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను వేడుకుంటున్నారు.

వారి పరిస్థితి గురించి తెలుసుకున్న మలేసియాలోని భారతీయ స్వేచ్ఛా వాణిజ్య సంఘాల సమాఖ్య వెంటనే స్పందించింది. వారికి అండగా నిలవడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్ర‌తినిధురాలు సుమిత బాధిత యువ‌కుల‌ను క‌లుసుకున్నారు. స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇందులో భాగంగా భారత రాయబార కార్యాలయం అధికారులను కలిశామని, వారం రోజుల్లో స్వదేశానికి పంపించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

CFTUI will help those Visakha Youths, who stranded in Malaysia with out Passport

బాధితులు తాము ఎలా మోసపోయిందనే విష‌యాన్ని సుమిత‌కు వివ‌రించారు. ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి ఏజెంట్లు తమను మోసం చేశారని అన్నారు. ఉద్యోగాలు లేక, చేతిలో డ‌బ్బులు లేక‌ తాము పస్తులతో కాలం గ‌డుపుతున్నామ‌ని చెప్పారు. తాము మూడు నెలల కాల వ్యవధి గల విజిటింగ్‌ పాస్‌పోర్టుపై మలేషియా వచ్చామని, ఉద్యోగం దొర‌క్క‌పోవ‌డం వ‌ల్ల పాస్‌పోర్టులు రెన్యువల్‌కు నోచుకోలేదని అన్నారు. స్వ‌దేశానికి వెళ్లాలంటే పాస్‌పోర్ట్‌ను రెన్యూవ‌ల్ చేయించుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని, దీనికోసం త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేవ‌ని చెప్పారు. తమ పాస్‌పోర్టులు ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు ఏజెంట్ల వ‌ద్దే ఉన్నాయ‌ని అన్నారు. మరిశా వెంకునాయుడు, మరిశా మహేష్‌, మరిశా గిరీష్‌, మరిశా శ్రీనివాసరావు,

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Four Youngsters from Rajam Village in Buchaiahpeta Mandal in Visakhapatnam District M Venku Naidu, M. Mahesh, M. Girish, M. Srinivasa Rao were safe. Confederation of Free Trade Union of India branch in Malaysia represetative Sumitha met those people and gave assurance to flee to their Home Country Soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more