విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు లాంతర్ల స్తంభం' వివాదం.. సంచయిత వివరణ.. అశోక్ గజపతి రాజుకు సూటి ప్రశ్న..

|
Google Oneindia TeluguNews

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై వివాదం ముదురుతోంది. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఆ ప్రాంతానికి చేసిన ఆనవాళ్లను తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగానే జగన్ సర్కార్ స్తంభాన్ని తొలగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ట్విట్టర్ ద్వారా స్పందించారు. మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై చంద్రబాబు,తమ బాబాయ్ అశోక్ గజపతి రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సంచయిత వివరణ...


'విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబుగారు, మా బాబాయ్‌ అశోక్‌గజతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారు.' అని సంచయిత స్పష్టం చేశారు. ఓ గదిలో భద్రపరిచిన మూడు లాంతర్ల ఫోటోను కూడా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

అశోక్ గజపతిరాజుకు సూటి ప్రశ్న..


విజయనగరం చరిత్ర,సంస్కృతికి ప్రతీక అయిన 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా, మాన్సాస్‌ ఛైర్మన్‌గా ఉండగా బాబాయ్‌ అశోక్‌గజపతిగారు ఎందుకు ధ్వంసంచేశారని సంచయిత ప్రశ్నించారు. దానికి చంద్రబాబు వివరణ ఇవ్వగలరా? అని నిలదీశారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

IPL 2020 Cancellation Means No Pay For The Players Says ICA
కలెక్టర్ ఏమంటున్నారు..

కలెక్టర్ ఏమంటున్నారు..


విజయనగర అభివృద్ది పనుల్లో భాగంగా శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను తొలగించినట్టు కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడు లాంతర్ల స్థానంలో నూతన నిర్మాణాన్ని చేపట్టి... ఇప్పటివరకూ ఉన్న నాలుగు సింహాల బొమ్మతో పాటు నూతన లాంతర్లను ఏర్పాటు చేసే దిశగా పలు నమూనాలను సిద్ధం చేశామన్నారు. రానున్న 15 రోజుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుందన్నారు.

English summary
Mansas trust chairman Sanchaita Gajapati alleged that TDP chief Chandrababu Naidu and former union minister Ashok Gajapati Raju spreading misinformation about threee lanterns pillar in Vizianagaram. She questioned Ashok Gajapati Raju why he did't restored Moti Mahal built in 1869.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X