విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ అధినేతపై సెక్షన్ 151 ప్రయోగం.. తెల్లకాగితంపై ఏసీపీ సంతకంతో నోట్..

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటన సందర్భంగా గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో రోజంతా కొనసాగిన హైడ్రామా చివరికి అరెస్టుకు దారితీసింది. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే.. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లోని 151 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బాబును బలవంతంగా ఎయిర్ పోర్టు లాంజ్ లోకి తీసుకెళ్లారు.

ఒట్టికాగితంపై రాసిచ్చారు..

ఒట్టికాగితంపై రాసిచ్చారు..


రెండ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసుల పర్మిషన్ పొందారు. అయినప్పటికీ ఎయిర్ పోర్టు వద్ద భారీగా మోహరించిన వైసీపీ శ్రేణులు.. బాబు కాన్వాయ్ ని అడ్డుకోవడం.. టీడీపీ అధినేత సిటీలోకి అడుగుపెడితే ఆత్మహత్యలు చేసుకుంటామని వైసీపీ నేతలు హెచ్చరించడంతో పోలీసులు రూటు మార్చి.. వెనక్కి వెళ్లాలంటూ చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. అందుకు నో చెప్పడంతో చివరికి అరెస్టు చేశారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేయాలని బాబు కండిషన్ పెట్టడంతో పోలీసులు అప్పటికప్పుడు ఒట్టి కాగితంపై ఇలా రాసిచ్చారు..

ఏం రాశారంటే..

ఏం రాశారంటే..

‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన మీ(చంద్రబాబు) భద్రత దృష్ట్యా.. మిమ్మల్ని మరియు మీ అనుచరుల రక్షణ నిమిత్తం.. సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం ముదస్తు అరెస్టు చేస్తున్నాం.. ఈ నోట్ ద్వారా మీకు ఆ విషయాన్ని తెలుపుతున్నాం. ప్రక్రియకు మీరు సహకరించాల్సిందగా కోరుతున్నాం'' అని రాసున్న పేపరు ముక్కపై వైజాగ్ సిటీ వెస్ట్ డివిజన్ ఏసీపీ సంతకం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుకు సమయం పడుతుంది కాబట్టే అత్యవసరంగా పేపర్ పై నోటు రాసిస్తున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.

పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్..

పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్..


చంద్రబాబుపై ఏపీ పోలీసులు సెక్షన్ 151 బనాయించారు. అసలీ సెక్షన్ ఏం చెబుతోందంటే.. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఏదైనా పబ్లిక్ ప్లేసులో గుమ్మికూడి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చట్టప్రకారం వారిని అరెస్టు చేయొచ్చని సెక్షన్ 151 చెబుతోంంది. అయితే చంద్రబాబు పర్యటనకు పోలీసులే పర్మిషన్ ఇచ్చి.. మళ్లీ పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్ కేసు కింద అరెస్టు చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

హైడ్రామా ముగిసినట్లేనా?

హైడ్రామా ముగిసినట్లేనా?


డీసీపీ సంతకం చేసిన నోటు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను విశాఖ ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. అయితే బయట పరిస్థితులు చక్కబడ్డాక ఆయనను వదిలేస్తారా? లేక విమానంలో విజయవాడకు పంపేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సిఉంది. బాబు పర్యటన సందర్భంగా గురువారం ఉదయం నుంచి విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత కొనసాగింది.

English summary
TDP chief Chandrababu has been arrested by Visakhapatnam police on Thursday under section 151 in view of security measures. The police have taken him to the airport after a much struggle with the protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X