విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది .. అధినేత అరెస్ట్ పై టీడీపీ నేతలు ఫైర్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్న ప్రజా చైతన్య యాత్ర రసాభాసగా మారింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే చంద్రబాబును అడ్డుకున్న వైసీపీ నేతల తీరుతో టీడీపీ నేతలు కూడా బాహాబాహీకి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ అరెస్ట్ పై, తాజా పరిణామాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 విశాఖ ఎయిర్ పోర్ట్ లో హైడ్రామా పై టీడీపీ ఫైర్

విశాఖ ఎయిర్ పోర్ట్ లో హైడ్రామా పై టీడీపీ ఫైర్


నేడు విశాఖ ఎయిర్ పోర్ట్ లో హైడ్రామా నెలకొంది. చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్ళిన నేపధ్యంలో ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు, టమోటాలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు చంద్రబాబు వాహనంలోనే ఉండి పోయారు. నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో అదుపులోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబును నిర్బంధంలోకి తీసుకున్నారు . ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Recommended Video

Chandrababu Go Back : Jagan Faces Same Experience At Vizag Airport In 2017 | Oneindia Telugu
 బాబు ప్రాణాలకు ముప్పు ఉందని మండిపడుతున్న టీడీపీ నేతలు

బాబు ప్రాణాలకు ముప్పు ఉందని మండిపడుతున్న టీడీపీ నేతలు

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబును అడ్డుకోవడంపై కోర్టుకు వెళ్తామన్నారు. ఇక చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్‌ చేయకుండా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా?.. ప్రతిపక్షంలో ఉంటే పక్షపాతం చూపిస్తారా? అంటూ మండిపడ్డారు వర్లరామయ్య. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పక్షపాతం చూపలేదన్నారు.

 భద్రత కల్పించటంలో వైసీపీ వైఫల్యం

భద్రత కల్పించటంలో వైసీపీ వైఫల్యం

ఇక ప్రతిపక్ష నేతపై దాడి జరిగిన ఘటనలు ఎప్పుడూ లేవని మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో జగన్‌ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆ పార్టీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. దీనికి సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని కనకమేడల విమర్శించారు.

English summary
TDP President and former CM Chandrababu today became a praja chaitanya yathra in Visakhapatnam. Amid intense tensions, TDP chief Chandrababu has been taken into custody by the police. Chandrababu was arrested under Section 151. TDP leaders are angry over the arrest and the latest developments. Chandrababu's life threatened by TDP leaders criticizing the YCP government and police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X