విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పాపం తండ్రీకొడుకులదే: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై చంద్రబాబు సవాల్

|
Google Oneindia TeluguNews

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనుమతుల విషయంలో అధికార వైసీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఆరోపణల్లో నిజం లేదని, అదంతా దుష్ప్రచారమేనని ఆయన అన్నారు.

 ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఏదైనా ఆఫీసులో ఒక్కరిద్దరికి కరోనా సోకితే ఏం చేయాలంటే..: కేంద్రం కొత్త మార్గదర్శకాలు

జగన్ తప్పుడు ప్రచారం..

జగన్ తప్పుడు ప్రచారం..

సీఎం జగన్ అవాస్తవాలు పరాకాష్టకు చేరాయని చంద్రబాబు విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్‌కు అధికార వైసీపీ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని చెప్పడం అవాస్తవమని అన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పాపమే..

కాంగ్రెస్ పాపమే..

టీడీపీ హయాంలో ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి 1961 నుంచి 2020 వరకు అన్ని వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వినియోగిస్తున్న 219 ఎకరాల భూమిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరా రూ. 2500 చొప్పున కేటాయించిందని చంద్రబాబు తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను కూడా అప్పటి ప్రభుత్వమే ఇచ్చిందన్నారు.

వైఎస్, కిరణ్ హయాంలోనే..

వైఎస్, కిరణ్ హయాంలోనే..


2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని, 2009 సెప్టెంబర్ 1న మరోసారి వైఎస్ ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 2012ల రెండుసార్లు అనుమతులు వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులను టీడీపీ ప్రభుత్వం రెన్యూవల్ మాత్రమే చేసిందని చంద్రబాబు వివరించారు.

Recommended Video

TDP MP Galla Jayadev Supports CM Jagan's Comment On Covid 19
జగన్‌కు చంద్రబాబు సవాల్

జగన్‌కు చంద్రబాబు సవాల్

అంతేగాక, పాలిస్టెరీన్, ఉత్పత్తుల విస్తరణకు టీడీపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని చంద్రబాబు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్‌కు సంబంధించి టీడీపీ సమర్పించి వివరాలపై వైసీపీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి గత ప్రభుత్వ చర్యలే కారణమంటూ అధికార వైసీపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు.

English summary
TDP chief chandrababu slams ysrcp govt for vizag gas leak incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X