విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nutan naidu: శిరోముండనం చేయమని చెప్పలేదు, చిటీలు, క్రెడిట్ కార్డుతో నెట్టుకొస్తున్నా..

|
Google Oneindia TeluguNews

శ్రీకాంత్‌కు శిరోముండనం చేయాలని తాను చెప్పలేదు అని సినీ నిర్మాత నూతన్ నాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు పలు అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్‌ నాయుడిని పోలీసులు విచారించారు. శిరోముండనం విషయంలో నిర్దోషినని చెప్పినట్టు అతను సమాచారం.

గుండు గీయమని చెప్పలేదు..

గుండు గీయమని చెప్పలేదు..

దళిత యువకుడు శ్రీకాంత్‌కు గుండు గీయమని చెప్పలేదని విచారణలో నూతన్ నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. మూడురోజుల కస్టడీలో పోలీసులు పదే పదే ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదని మాత్రం పదే పదే చెప్పుకొచ్చాడు. దీంతోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ పేరును ఎక్కడ చెప్పలేదన్నారు. అలా చెప్పి పనులు చేయించుకునే శక్తి తనకు లేదన్నారు. ఆ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నాడు. క్రెడిట్ కార్డులు, చీటీలు పాడిన డబ్బులతోనే ఇంటిని నెట్టుకొస్తున్నానని నూతన్ నాయుడు చెప్పినట్టు సమాచారం. సోమవారంతో నూతన్ నాయుడు పోలీస్ కస్టడీ ముగిసిన సంగతి తెలిసిందే.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

విశాఖపట్టణం సుజాతనగర్‌లో బిగ్ బాస్ ఫేం నూతన్‌ నాయుడు దంపతులు ఉంటున్నారు. ఇతని వద్ద గిరిప్రసాద్ నగర్‌కి చెందిన కర్రి శ్రీకాంత్ పనిచేసేవాడు. 4 నెలలు పనిచేసి.. ఇటివలే మానేశాడు. దీంతో నూతన్ నాయుడు మనుషులు.. అతని పిలిచి మాట్లాడారు. గతంలో ఇంటికి వచ్చిన బ్యూటీషియన్‌ సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేశారని చెప్పారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా తిట్టిపోశారు. సెల్ ఫోన్ పోయిందని నెపం వేశారు. తర్వాత మంగళిని పిలిపించి.. గుండు కొట్టించారు. తర్వాత శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు శిరోముండనం ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుగురు సహా నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడురోజుల కస్టడీ కూడా ముగిసింది.

Recommended Video

Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
ఉద్యోగం పేరుతో మోసం

ఉద్యోగం పేరుతో మోసం

విశాఖపట్టణం జిల్లా రావికమతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి స్నేహితులు. నూకరాజు సీసీ కెమెరాలు, శ్రీకాంత్ రెడ్డి స్ధిరాస్తి వ్యాపారం చేసేవారు. వీరికి నూతన్ నాయుడితో పరిచయం ఏర్పడింది. వారి వద్ద డబ్బు ఉంది అని నూతన్ నాయుడు గ్రహించాడు. ఎస్బీఐలో మంచి ఉద్యోగాలు అని బురిడీ కొట్టించాడు. దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్ రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే తమ జాబ్ గురించి అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని కాలం వెళ్లదీశారు. అలా రెండేళ్లు గడిచిన.. వారి ఉద్యోగాలు రాలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

English summary
chit, credit cards use to home needs nutan naidu said in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X