• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్

|

ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ లో 19ఏళ్ల యువతిపై హత్యాచారం ఘటనపై ఆందోళనలను తీవ్రతరం అవుతోన్నవేళ.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజధాని విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పాస్టర్.. తన చర్చికి వచ్చే మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేయగా, ఈ సంఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ఓ వ్యక్తి.. చిన్నాచితకా పనులు చేసుకుంటూ, వాంబే కాలనీలోని సనత్ నగర్ లో తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట భార్య చనిపోవడంతో పిల్లల ఆలనా పాలనా అతనే చూసుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్న తమకు దేవుడు సాయం చేస్తాడనే నమ్మకంతో వీరంతా వాంబే కాలనీలోనే ఉన్న చర్చికి వెళ్లేవారు. కానీ ఆ చర్చి పాస్టరే తమ పాలిట సైతాను అవుతాడని వారు ఊహించలేకపోయారు. రెండ్రోజుల కిందట..

రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్

పెద్ద కూతురి కోసం వెళ్లగా..

పెద్ద కూతురి కోసం వెళ్లగా..

తన ముగ్గురు పిల్లలు(ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి)ని వెంటపెట్టుకుని ఆ తండ్రి.. సోమవారం ఉదయం వాంబే కాలనీలో వున్న చర్చికి వెళ్లాడు. పాస్టర్‌ మునిబాబు అలియాస్‌ హెబెల్‌(32)తో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు వెళ్లారు. అక్కడ ప్రార్థనలు ముగించుకుని, అదే రోజు రాత్రికి వాంబే కాలనీకి చేరుకుని, అంతా చర్చిలోనే నిద్రించారు. మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన తండ్రి.. పెద్ద కూతురు(16)ను నడుచుకుంటూ రమ్మని చెప్పాడు. కానీ ఆమె ఎంతకూ రాకపోవడంతో తిరిగి చర్చి వద్దకు వెళ్లగా దారుణం బయటపడింది..

దున్నపోతుపై వచ్చి దుమ్మురేపాడు - క్రేజీ కాదు, సెంటిమెంట్ - రాజకీయ చైతన్యంలో బీహార్ ప్రత్యేకత తెలుసా?

పాస్టర్‌పై పోక్సో చట్టం కింద..

పాస్టర్‌పై పోక్సో చట్టం కింద..

నడిచి రమ్మంటే ఇంకా ఇక్కడే ఎందుకున్నావని తండ్రి అడగడంతో ఆ కూతురు కన్నీటిపర్యంతమైంది. పాస్టర్‌ తనను వెనక్కు పిలిచి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో ఆ తండ్రి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు మైనర్ బాలిక కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పాస్టర్‌ హెబెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

  Vizag Gas Leak : NGT Issues Notices To Centre & LG Polymers India
  అన్నగా ఉంటానన్న లోకేశ్..

  అన్నగా ఉంటానన్న లోకేశ్..

  మైనర్ బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం ఘటన.. రాష్ట్రంలో మహిళల పరిస్థితికి అద్దం పడుతున్నదని, బాధితురాలికి న్యాయం జరిగేదాకా టీడీపీ పోరాడుతుందని నారా లోకేశ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్లు చేశారు. ‘‘విశాఖపట్నం, గాజువాక వాంబే కాలనీలో మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం ఘటన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల తీవ్రతని తెలియజేస్తోంది. బాధిత బాలిక తండ్రి, మేనత్తతో ఫోన్లో మాట్లాడాను. బాలికకు అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చాను. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా వారి కుటుంబం చేస్తున్న పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది'' అని లోకేశ్ భరోసా ఇచ్చారు.

  English summary
  Gajuwaka police arrested a 30- year-old pastor for allegedly attempting to rape a 16- year-old girl at his residence in Vambay Colony of Vizag city on Tuesday morning. reacting on the incident, tdp leader nara lokesh on wednesday extends support to the victim family.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X