విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ ను కలిసిని సింధు: కీలక నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి..!!

|
Google Oneindia TeluguNews

బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్‌ పీవీ.సింధు ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత ఆమె తొలిసారిగా ముఖ్యమంత్రిని కలిశారు. ఢిల్లీ నుండి విజయవాడ చేరుకున్న సింధుకు మంత్రి అవంతి శ్రీనివాస్..కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్వాగలం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు సింధు విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సమయంలో జగన్ స్వర్ణపతకం సాధించిన సింధును అభినందించారు. సింధు మరిన్ని విజయాలు సాధించటానికి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మరో కీలక ప్రకటన సైతం ముఖ్యమంత్రి చేసారు. ప్రభుత్వ తరపున సింధుకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసారు. సింధు గవర్నర్ హరి చందన్ ను సైతం కలవనున్నారు.

గ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం : ఉద్యోగుల ఎంపిక..శిక్షణగ్రామ సచివాలయాలు మరింత ఆలస్యం : ఉద్యోగుల ఎంపిక..శిక్షణ

సింధు పైన ముఖ్యమంత్రి జగన్ ప్రశంసలు..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత తొలి సారిగా పీవి సింధు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆయన సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. సింధు మరిన్ని విజయాలు సాధించటానికి ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చూపించిన అభిమానానికి..ప్రోత్సాహానికి సింధు సంతోషం వ్యక్తం చేసారు. అదే విధంగా బ్యాడ్మింటెన్ పోత్సాహానికి తాను సహకారం అందిస్తానని సిందు హామీ ఇచ్చారు. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని సింధు చెప్పుకొచ్చారు.

Cm Jagan announces five acres land for badminton academy in vizag

వైజాగ్ లో అయిదు ఎకరాలు స్థలం..
సింధు తనను కలిసిన సమయంలో తమ ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి జగన్ స్పష్ం చేసారు. సింధుకు అభినందనలు తెలపుతూనే మరింత మందిని ప్రపంచ మేటి క్రీడా కారులుగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్సు చేయడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. ఆ సభలో ముఖ్యమంత్రి జగన్ మరిన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

English summary
PV sindhu met Ap Cm jagan in secretariat. Cm announced govt allot five acers of land in Vizag for badminton academy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X