విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలింత అయినా కరోనాపై పోరాటంలో నేను సైతం అంటున్న గ్రేటర్ విశాఖ కమీషనర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ప్రజలు బయటకు రాకుండా సూచిస్తున్నాయి. ఇక అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని చెబుతున్నాయి.

నగరపాలక సంస్థ ఉద్యోగులంతా శుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇక ఈ నేపథ్యంలోనే మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన బాలింత అయినప్పటికీ విధి నిర్వహణలో నేను సైతం అంటూ తొమ్మిది రోజులు సెలవులు ముందుగానే విధుల్లో చేరారు.

నేటి నుండి విధులకు హాజరవుతున్న మహా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విధుల్లో చేరారు. ఈనెల 4వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ప్రసూతి సెలవు లో ఉన్న ఆమె తొమ్మిది రోజులకు ముందుగానే విధుల్లో చేరారు.

Commissioner of Greater Visakha fight against corona as Postpartum mother

4వ తేదీన బిడ్డను ప్రసవించిన కమిషనర్ సృజన ఈనెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ సందర్భంగా తన బిడ్డతో కలిసి కరోనా వైరస్ పై పోరాటం సాగిస్తున్న వైద్యులు, పోలీసులు, శుభ్రత సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

వచ్చే నెల నాలుగో తేదీ వరకు సెలవు ఉన్నప్పటికీ తొమ్మిది రోజులు ముందుగానే విధులకు హాజరు ఈ నగర ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నేటి నుండి విధుల్లో ఉండబోతున్న కమిషనర్ సృజన గ్రేటర్ విశాఖ నగర పాలక సిబ్బందికి ఒక ఇన్స్పిరేషన్.

నవజాత శిశువును ఇంట్లో పెట్టుకుని కరోనా పై సమరానికి వెళ్తున్న విశాఖ నగరపాలక సంస్థ కమీషనర్ ను కుటుంబ సభ్యులు వారిస్తున్నా ఆమె ప్రజల కోసం నేను సైతం అంటూ విధుల్లో చేరారు. కరోనాపై సమరం చెయ్యటం తన బాధ్యత అంటున్నారు.

English summary
Maha Vishakha municipal corporation commissioner is on duty today. She has joined due to special emergencies in the wake of the outbreak of the corona .Commissioner Shrijana was on maternity leave from April 4 to April 4 and joined the duty nine days in advance. Commissioner Shrijana, who delivered the baby on the 4th, thanked the doctors, police and cleaning staff who were fighting the coronavirus with her child during the Janata curfew on the 22nd of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X