విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ లాంగ్ మార్చ్ కు వామపక్షాలు దూరం: మీ వైఖరి ఆమోద యోగ్యం కాదంటూ: జనసేనానికి లేఖ..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ విశాఖ లో నిర్వహిస్తున్న మార్చ్ లో పాల్గొనకూడదని వామపక్షాలు నిర్ణయించాయి. ఈ నెల 3న విశాఖలో తమ పార్టీ నిర్వహించే ఈ మార్చ్ లో పాల్గొని మద్దతివ్వాలని వామపక్ష పార్టీల నేతలతో పాటుగా టీడీపీ..బీజేపీ నేతలను పవన్ ఆహ్వానించారు. అయితే, బీజేపీ ఇప్పటికే సంఘీభావం మాత్రం ప్రకటించి..పవన్ తో కలిసి వేదిక పంచుకోలేమ ని తేల్చి చెప్పింది. ఇక, ఇదే సమయంలో టీడీపీ అధినేత మాత్రం తమ పార్టీకి చెందిన సీనియర్లు పవన్ ఆధ్వర్యంలో జరిగి ఈ మార్చ్ లో పాల్గొంటారని స్పష్టం చేసారు. అయితే..ఎన్నికల ముందు నుండి పవన్ తో మిత్రులుగా కొనసాగుతున్న సీపీఐ..సీపీఎం మాత్రం తాము ఈ ర్యాలీలో పాల్గొనటం లేదని స్పష్టం చేస్తూ పవన్ కళ్యాన్ కు లేఖ రాసారు. అందులో తాము ఎందుకు హాజరు కావటం లేదో వివరించారు. పవన్ వైఖరి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు జనసేనకు మద్దుతుగా టీడీపీ..లోక్ సత్తా మాత్రమే హాజరు కానున్నాయి. కాంగ్రెస్ నిర్ణయం తెలియాల్సి ఉంది.

ఆ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్: సన్నాహాల్లో జనసైన్యం..రెస్పాన్స్ వస్తుందా? ఆ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్: సన్నాహాల్లో జనసైన్యం..రెస్పాన్స్ వస్తుందా?

పవన్ మార్చ్ కు ఆ వామపక్షాలు దూరంగా..
ఈ నెల 3న విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగా మార్చ్ కు నిర్ణయించారు. రాష్ట్రంలో ఇసుక కొరత.. భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో అన్ని పార్టీలను భాగస్వాములను చేయాలని భావించారు. అందుకోసం స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అదే విధంగా వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శులు..కాంగ్రెస్..లోక్ సత్తా నేతలను పవన్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే, బీజేపీ తాము ఇప్పటికే నిరసనలు కొనసాగిస్తున్నామని..పవన్ నిర్వహించే మార్చ్ కు సంఘీభావం ప్రకటిస్తూ..ఆయనతో కలిసి వేదిక పంచుకోలేమని స్పష్టం చేసింది. ఇక, ఇప్పుడు వామపక్ష పార్టీు సీపీఐ..సీపీఎం సైతం పవన్ నిర్వహించనున్న ఈ మార్చ్ కు సంఘీభావం ప్రకటించాయి. కానీ, మార్చ్ లో మాత్రం పాల్గొనలేమని రెండు పార్టీలకు చెందిన నేతలు పవన్ కళ్యాణ్ కు లేఖ రాసారు.

Communist parties decided to not participate in pawan Kalyan march in Vizag

మీ వైఖరి ఆమోద యోగ్యం కాదంటూ..
పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి బీజేని ఆహ్వానించటం కమ్యూనిస్టు పార్టీల నేతలకు నచ్చటం లేదు. బీజేపీ సహకారం తీసుకోవటానికి మీకు అభ్యంతరం లేదని మీ ఆహ్వానం ద్వారా అర్దమవుతున్నదని.. ఈ వైఖరి తమకు ఆమోద యోగ్యం కాదని తేల్చి చెబుతూనే.. పవన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుండి హాజరు కాలేకపోతున్నామంటూ సీపీఐ..సీపీఎం పార్టీల రాష్ట్ర కార్యదర్శలు రామక్రిష్ణ, మధు సంయుక్తంగా పవన్ కు లేఖ రాసారు. అయితే తమ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేసారు. ఇక, తాము ముఖ్యమైన ప్రజా సమస్యల పైన ఇప్పటికే తమ రెండు పార్టీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తునన విషయాన్ని ఆ ఇద్దరూ తమ లేఖలో గుర్తు చేసారు. దీని ద్వారా ఇప్పుడు టీడీపీ..లోక్ సత్తా నేతలు మాత్రమే పవన్ కళ్యాణ్ మార్చ్ కు మద్దతిస్తున్న ఇతర పార్టీలుగా ఉన్నాయి. ఇక, కాంగ్రెస్ నేతలను పవన్ ఆహ్వానించినా..వారి వైఖరి పైన స్పష్టత రాలేదు. దీంతో..పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకు మద్దతివ్వని పార్టీల విషయంలో భవిష్యత్ లో ఏరకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Communist parties decided to not particiapte in pawan Kalyan marh in Vizag. CPI and CPM state secretaries letter to pawan Kalayn on thier decision. They says Pawan tried for BJP support that will nor agree for those parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X