విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

coronavirus : విజయవాడతో పోలిస్తే విశాఖలోనే హై రిస్క్ - క్వారంటైన్లో 1470 మంది- పదిమందికో అధికారి..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం దాదాపుగా నియంత్రణలో ఉన్నట్లే కనిపిస్తున్న విశాఖపట్నంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఒంగోలు, విజయవాడ, కాకినాడలో ఒక్కో పాజిటివ్ కేసుకు చికిత్స కొనసాగుతుండగా... విశాఖలో మాత్రం ఏకంగా మూడు కేసులకు చికిత్స అందిస్తున్నారు. నెల్లూరులో పాటిజివ్ నమోదైన విద్యార్ధికి నయం కావడంతో ఇంటికి పంపేశారు.

తెలంగాణతో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్..

తెలంగాణతో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్..


అంతర్జాతీయ ప్రయాణికుల రాక అధికంగా ఉండే హైదరాబాద్ తో పాటు తెలంగాణ నగరాలతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడం ఆలస్యంగా ప్రారంభించినా.. విజయవాడ, విశాఖ ఎయిర్ పోర్టులకు వచ్చిన విదేశీ ప్రయాణికుల కారణంగా ఇక్కడ ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. అలా చూసినా ఇప్పటివరకూ ఏపీ వ్యాప్తంగా 7 పాటిజివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. వీటిలో ఇప్పటికే నెల్లూరు విద్యార్ధికి క్వారంటైన్ పూర్తయి నెగెటివ్ గా తేలడంతో ఇంటికి పంపేశారు.

ఒంగోలు, విజయవాడ, కాకినాడ, విశాఖలోనే...

ఒంగోలు, విజయవాడ, కాకినాడ, విశాఖలోనే...

ప్రస్తుతం ఏపీలోని ఒంగోలు, విజయవాడ, కాకినాడలో ఒక్కో కరోనా పాటిజివ్ బాధితులకు చికిత్స జరుగుతోంది. విశాఖలో మాత్రం ముగ్గురు బాధితులను క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విశాఖలో సౌదీ అరేబియా నుంచి నగరానికి వచ్చిన ఓ పాజిటివ్ కేసు వృద్ధుడి కారణంగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకింది. వీరితో పాటు తాజాగా విదేశాల నుంచి వచ్చిన మరో విద్యార్ధికి సైతం పాటిజివ్ గా తేలింది. దీంతో ఈ ముగ్గురికి ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

విశాఖలోనే హై రిస్క్ ఎందుకంటే..

విశాఖలోనే హై రిస్క్ ఎందుకంటే..

విజయవాడతో పాటు విశాఖలోనూ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కానీ విజయవాడతో పోలిస్తే విశాఖకు అంతర్జాతీయ సర్వీసుల కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. దీంతో విశాఖలో ఇప్పటికే పదుల సంఖ్యలో విదేశాల నుంచి ప్రయాణికులు చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరి పరిస్దితి ఏంటో పూర్తిగా తేలలేదు. కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలడంతో వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తేనే వారు బయటికి వచ్చే అవకాశముంది. దీంతో ప్రభుత్వం కూడా ఎలాంటి లక్షణాలు కనిపించినా వారిని ఇళ్లలో నుంచి బయటికి వచ్చి క్వారంటైన్ విభాగంలో చికిత్స తీసుకోవాలని సూచిస్తోంది.

మూడు హైరిస్క్ జోన్ లు.. పదిమందికో అదికారి..

మూడు హైరిస్క్ జోన్ లు.. పదిమందికో అదికారి..

విశాఖలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా ప్రకటించింది. వీటితో పాటు నగరానికి ఇప్పటికే చేరుకున్న పలువురు విదేశీయుల కోసం పదిమందికి ఒకరు చొప్పున అధికారులను కూడా నియమించింది. పంచాయతీల్లోనూ కార్యదర్శిని ప్రత్యేక అధికారిగా ప్రకటించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1470 మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

English summary
coronavirus affect is higher in visakhapatnam city comparatively in vijayawada. so far vizag reported 3 coronavirus positive cases and govt announced three areas in the city as high risk zones. where as in vijayawada one area is considered as high risk zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X