• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా కాలంలో ఒక్కటైన జంటలు ... ఏడుగురు అతిధుల సాక్షిగా మూడు ముళ్ళ బంధం

|

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇక చాలా మంది జంటలు పెళ్లి చేసుకుని ఒక్కటి అవ్వాలని భావించినా వారందికి కరోనా బ్రేక్ వేసింది. ఇక కరోనా కట్టడి కోసం ప్రకటించిన లాక్ డౌన్ తో అన్ని కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు ఆపాల్సిందిగా అధికారులు ఆదేశించారు. అంతే కాదు నలుగురు ఒక చోట ఉండరాదని ఆదేశించారు . రవాణా సౌకర్యాలు కూడామేళ తాళాలతో ,వేద మంత్రాలతో, బంధుమిత్రుల సమక్షంలో అట్టహాసంగా పెళ్లి జరుపుకోవాలని భావించిన వారు పెళ్ళిళ్ళనే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

కరోనా జననం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1:38: ప్రపంచాన్ని బంధించిన వందరోజులు: షాకింగ్ ట్విస్టులుకరోనా జననం డిసెంబర్ 31 మధ్యాహ్నం 1:38: ప్రపంచాన్ని బంధించిన వందరోజులు: షాకింగ్ ట్విస్టులు

ఏడుగురు అతిధుల సాక్షిగా ఒక్కటైన జంటలు

ఏడుగురు అతిధుల సాక్షిగా ఒక్కటైన జంటలు

ఇక ఇలాంటి విపత్తు ముంచేస్తున్న సమయంలో ముఖ్యంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ జరిగిన కళ్యాణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతుంది. పెళ్లంటే నూరేళ్ళ పంట. అలాంటి పెళ్లి అందరి మధ్యలో జరుపుకోవాలని ఒక గుర్తుగా నిలిచిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ఒక రెండు జంటలు ఇవేవి లేకుండానే కేవలం ఏడుగురు అతిథులే సాక్షులుగా వివాహం చేసుకుని ఒక్కటయ్యారు . కరోనా తమ కళ్యాణాన్ని ఆపలేదని తేల్చి చెప్పారు .

 లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే అనకాపల్లిలో రెండు పెళ్ళిళ్ళు ..

లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూనే అనకాపల్లిలో రెండు పెళ్ళిళ్ళు ..

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది . అయినా సరే అనకాపల్లి గవరపాలెంకు చెందిన వధూవరుల జంటలు మాంగల్య బంధంతో ఒక్కటయ్యారు . పరిమితమైన జనం అంటే కేవలం ఏడుగురితోనే పెళ్లి తతంగం పూర్తి చేసేందుకు అధికారుల నుండి అనుమతులు తీసుకున్న సదరు కుటుంబాలు రెండు జంటలు గురువారం రాత్రి ఒక్కటయ్యాయి. గవరపాలెంలో పెళ్లి కొడుకు మహేశ్‌తో పాటు ఏడుగురు మరియు పురోహితుడు , ఇక ఇదే సమయంలో తాకాశి వీధిలో పెళ్లికొడుకు ఈశ్వరరావుతో పాటు ఏడుగురు మాత్రమే ఉండేటట్లు చూసి పెళ్లి తతంగం పూర్తి చేశారు.

  Lockdown Effect : Crows Demising Mysteriously In Tamilnadu & Andhrapradesh
   కరోనా సమయంలో గుర్తుండిపోయేలా రెండు పెళ్ళిళ్ళు

  కరోనా సమయంలో గుర్తుండిపోయేలా రెండు పెళ్ళిళ్ళు


  పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు, పెళ్లి చేసే పురోహితుడు మాత్రమే ఉండేటట్లు కేవలం ఏడుగురితో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. మొత్తానికి కరోనా కాలంలోనూ ఒక్కటైనా జంటలుగా వీరి పెళ్లిళ్ళు గుర్తుండిపోతాయని అందరూ అనుకుంటున్నారు . ఇక చాలా జంటలు ఎప్పుడు ఈ కరోనా మహమ్మారి నుండి బయట పడతాం అని ఎప్పుడెప్పుడు తమ పెళ్లి జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. లాక్ డౌన్ పొడిగించినా, ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా వెంటనే వారి వివాహాలకు ప్రభుత్వం నుండి అట్టహాసంగా జరుపుకోవటానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందన్న గ్యారెంటీ లేదు .ఇక ఈనేపధ్యంలో పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తున్న వేలాది జంటలు చెప్పలేని బాధలో ఉన్నాయి.

  English summary
  Two couples in Visakhapatnam tied the knot with no guests. The parents of the groom and the bride, along with a priest, were only present in the marriages. The weddings was planned on an auspicious day four months ago, but the coronavirus scare amid lockdown has dented their plans of a grand marriage. It took place smoothly without the participation of a vast gathering. The weddings took place at the groom's house in the NTR colony, Gavarapalem area and also in takasi veedhi in Anakapalli town of Visakhapatnam.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X