విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భ్రష్టుపట్టిస్తున్నారు: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై దాడి విమర్శలు, లోకేష్‌కు చురకలు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం/అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. కీలకమైన బిల్లులు శాసనమండలిలో చర్చకు వచ్చిన సందర్భంగా ఆయన మంగళవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.

నారా లోకేష్‌కు చురకలు

నారా లోకేష్‌కు చురకలు


శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. శాసనమండలిలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. శాసనమండలిని తొలగించే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేత నారా లోకేష్.. రాజకీయాలు తెలుసుకోవాలన్నారు. నారా లోకేష్.. తన తండ్రి చంద్రబాబును.. పైనున్న తాత ఎన్టీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని చురకలంటించారు. మండలి ఛైర్మన్‌కు ఒక బిల్లును అడ్మిట్ చేయలా? వద్దా? అనే అధికారం లేదని అన్నారు. ఏ బిల్లులైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానికి మద్దతు తెలుపాలా? వద్దా? అనేది సభ్యులు నిర్ణయిస్తారని తెలిపారు. టీడీపీకి మెజార్టీ ఉంటే మండలిలో బిల్లుకు సవరణలు కోరవచ్చని అన్నారు.

జగన్ చారిత్రాత్మక నిర్ణయం..

జగన్ చారిత్రాత్మక నిర్ణయం..


సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని దాడి వీరభద్రరావు కొనియాడారు. ఆయన ప్రసంగాన్ని అందరూ చూడాల్సిన అవసరం ఉందన్నారు. మూడు ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రకరణ చేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని దాడి ప్రశంసించారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు.

టీడీపీ ఉపప్రాంతీయ పార్టీగా..

టీడీపీ ఉపప్రాంతీయ పార్టీగా..


శాసనమండలి ప్రతిష్టంభన వెనుక చంద్రబాబు ఉద్దేశమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని కోరారు. ప్రతిపక్ష నేత బాధ్యత కూడా చంద్రబాబు సరిగా నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా? అని దాడి నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల అవసరం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు.

పవన్‌కు అమరావతి ఉంటే చాలా?

పవన్‌కు అమరావతి ఉంటే చాలా?


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పైనా దాడి వీరభద్ర రావు విమర్శలు గుప్పించారు. అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్తలు ఈ విషయం గుర్తించాలన్నారు.

English summary
dadi veerabhadra rao slams chandrababu and pawan kalyan for 3 capital cities issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X