• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ 3 జిల్లాల్లో 8 లక్షల ఎకరాల సాగు, 2 లక్షల మందికి ఉపాధి, వికేంద్రీకరణ పార్ట్-1లో విజయసాయి..

|

వికేంద్రీకరణే అభివృద్ధి మంత్రం అని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇదివరకు ఒకేచోట అభివృద్ది జరగడంతో ఇబ్బందులు తప్పలేదన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ అభివృద్ధి వికేంద్రీకరణపై ఫోకస్ చేశారని.. ఆయన అడుగు జాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణే అభివృద్ధి మంత్రం పేరుతో సోషల్ మీడియాలో పార్ట్-1 పోస్ట్ చేశారు. అందులో చంద్రబాబు చర్యలను ఏకీపారేశారు.

న్యాయ వ్యవస్థపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు .. కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు కనకమేడల,రామ్మోహన్ నాయుడు

వికేంద్రీకరణతోనే డెవలప్..

వికేంద్రీకరణతోనే డెవలప్..

శ్రీకాకుళం నుంచి చిత్తూరు, ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు అభివృద్ధి వైఎస్ఆర్ బాటలు వేశారని విజయసాయి గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అపారమైన సహజ, మానవ వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని ఉపయోగించడంతో ఈ ప్రాంతం మరో కోనసీమ అవుతుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వలసలు ఆగుతాయని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ప్రధాన కారణం సాగునీటి సౌకర్యం లేకపోవడమేనని విజయసాయి తెలిపారు. దీంతో ఇక్కడి వారు వలసబాట పడుతున్నారని తెలిపారు. 40 లక్షల ఎకరాల భూమిలో 8 లక్షల ఎకరాలకే ఇరిగేషన్ సదుపాయం ఉంది అని విజయసాయి తెలిపారు. ఏటా 200 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవడంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్ సర్కార్ ఫోకస్ చేసిందని తెలిపారు.

 8 లక్షల ఎకరాలు సాగు..

8 లక్షల ఎకరాలు సాగు..

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు తమ ప్రభుత్వం నిధులు సమకూర్చిందని తెలిపారు. దీనితో శ్రీకాకుళం, విజయగరం, విశాఖపట్టణంలో 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గోదావరి వరద జలాలతో ఉత్తరాంధ్ర భూములను సస్యశ్యామలం చేస్తాయని తెలిపారు. విశాఖ చుట్టూ ఉన్న పరిశ్రమల అవసరాలను కూడా తీరుస్తాయని చెప్పారు. అయితే ఉపాధి లేకపోవడంతోనే ఉత్తరాంధ్ర నుంచి 30 ఏళ్లలో 20 లక్షలమంది వలసలు వెళ్లి పోయారని వివరించారు. వ్యవసాయంతోపాటు పారిశ్రామిక, రవాణా, టూరిజం అభివృద్ధికి కృషిచేస్తున్నామని వివరించారు.

 భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం..

భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం..

మూడు జిల్లాల్లో మానవ, సహజ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ప్రణాళిక రచించి, అమలు చేస్తుందని విజయసాయి తెలిపారు. శ్రీకాకుళంలోని భావనపాడు పోర్టు పూర్తిచేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీనితో ఒడిశా, ఛత్తీస్ గఢ్ నుంచి కూడా కార్గో ఎక్స్ పోర్ట్ అవుతుందన్నారు. నౌపడ నుంచి భావనపాడుకు రోడ్డు, రైలు కనెక్టివిటీ పెరిగి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతుందని వివరించారు. ఉద్యానవన పంటలు.. అరటి, కొబ్బరి, జీడిమామిడి, పనస, మునగ, పైనాపిల్ సాగు, ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహమని తెలిపారు.

 2 లక్షల మందికి ఉపాధి..

2 లక్షల మందికి ఉపాధి..

ఫుడ్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీ వల్ల దాదాపు 2 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. నౌపడ ఉప్పు పరిశ్రమకు అండగా ఉంటామమన్నారు. అక్కడ పరిశ్రమను గుజరాత్ సాల్ట్ ఇండస్ట్రీ స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంతో 50 వేల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. బీచ్ ల్లో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. ఆర్కే బీచ్, భీమిలి, రుషికొండ, భావనపాడు, కళింగ పట్నం బీచ్‌లు పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. వీటి అభివృద్ది కోసం జగన్ సర్కార్ కట్టుబడి ఉంది అని చెప్పారు.

  Hyderabad : ముగిసిన Telangana Assembly వర్షాకాల సమావేశాలు || Oneindia Telugu

  English summary
  Decentralisation Justifies Development ysrcp mp vijaya sai reddy said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X