విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సంచలనం -19నుంచే సీఎంకు తెలుసన్న ప్రధాన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గతిని మార్చేసిదిగా భావిస్తోన్న 'విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్' వ్యవహారంలో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోనిదే అయినా, వైజాగ్ స్టీల్ ను ప్రైవేటుకు అప్పగించరాదంటూ ఏపీ అధికార పార్టీ వైసీపీ నేరుగా రోడ్లపైనే ఉద్యమిస్తోన్న వేళ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటనలు సంచలనం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాలనే కేంద్రం తన ప్రకటనలో చెప్పడంతో జగన్ పార్టీ ఇరకాటంలో పడ్డట్లయింది. వివరాల్లోకి వెళితే..

దేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామదేవుడు గొప్పోడు.. సాయిరెడ్డితో నిజం కక్కించాడు -ఇక వైసీపీ బంగాళాఖాతంలోకే: ఎంపీ రఘురామ

 రోడ్డెక్కిన వైసీపీ ఎంపీలు..

రోడ్డెక్కిన వైసీపీ ఎంపీలు..

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్‌ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు బుధవారం టీడీఐ జంక్షన్ వద్ద తలపెట్టిన నిరసనల్లో వైసీపీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా డజన్లకొద్దీ నేతలు పాలుపంచుకున్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలోనూ వైసీపీ నేతలు నేరుగా పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారని, విశాఖ ఉక్క-ఆంధ్రుల హక్కును కాపాడుకోడానికి రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కాగా, సాయిరెడ్డి ఇవాళ విశాఖ రోడ్లపై నిరసనలు చేస్తుండగా.. పార్లమెంటులోఇదే స్టీల్ ప్లాంటుపై ఆయన అడిగిన ప్రశ్నపైనే సంచలన ప్రకటన వెలువడింది..

 విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిలెడ్(ఆర్ఐఎన్ఎల్)గా వ్యవహరించే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను అడ్డుకుని తీరుతామంటోన్న వైసీపీ ఇటు గల్లీ ఉద్యమాలతోపాటు ఢిల్లీ సర్కారుపైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంటు భూములకు సంబంధించి అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం సమాధానం చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో కొరియాకు చెందిన పోస్కో సంస్థ మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతేకాదు.. 2019లోనే కుదిరిన ఈ ఒప్పందం వివరాలు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా తెలుసనే అర్థంలో కేంద్రం లోతైన క్లారిటీ ఇచ్చింది..

 మూడేళ్లుగా ఏపీ సీఎంతో పోస్కో టీమ్..

మూడేళ్లుగా ఏపీ సీఎంతో పోస్కో టీమ్..


దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థ విశాఖపట్నంలో నెలకొల్పాలనుకున్న ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నాడు ఒప్పందం కుదిరిన వెంటనే పోస్కో సంస్థ ప్రతినిధుల బృందం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుసుకుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని ప్రధాన్ వివరించారు. అంతేకాదు, ప్రైవేటైజేషన్ తర్వాత.. అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో సొంత ప్లాంట్ ఏర్పాటైన తర్వాత అందులో ఎవరి వాటాలు ఎంత? అనే విషయాలను కూడా మంత్రి వెల్లడించారు..

ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంతో తెలీదు

ఆర్‌ఐఎన్‌ఎల్‌ వాటా ఎంతో తెలీదు

2019లోనే పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందని, ఆ వెంటనే పోస్కో ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను కలిశారని చెప్పిన కేంద్ర మంత్రి ప్రధాన్.. విశాఖలో పోస్కో ప్లాంట్ ఏర్పాటును జాయింట్ వర్కింగ్‌ గ్రూప్‌ విధానంలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ మేరకు(జాయింట్ వర్కింగ్ గ్రూప్) ఏర్పాటు చేశామన్నారు. విశాఖ భూముల్లో కొత్తగా ఏర్పాటుకాబోయే ప్లాంట్‌లో పోస్కో సంస్థ వాటా 50 శాతంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నాయి. అయితే, ఆర్‌ఐఎన్‌ఎల్‌(విశాఖ స్టీల్ ప్లాంట్) వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని ఆయన సమాధానమిచ్చారు. పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని కేంద్రం రహస్యంగా ఉంచడంపై పలువురు మండిపడుతున్నారు. కానీ, ఇవాళ్టి ప్రకటనలో.. 2019 నుంచే పోస్కో ప్రతినిధులు.. ఏపీ సీఎంతో టచ్ లో ఉన్నారని కేంద్రం కుండబద్దలు కొట్టడంతో ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడలేని బలం చేకూరినట్లయింది. ఎందుకంటే..

పోస్కోతో జగన్ భేటీ.. ఫొటోలపై రచ్చ

పోస్కోతో జగన్ భేటీ.. ఫొటోలపై రచ్చ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాబోతోన్న సంగతి ఏపీ సీఎం జగన్ కు ముందే తెలుసని, ఉద్దేశపూర్వకంగానే ఆయన అందుకు సహకరించాడని, అడ్డగోలుగా భూముల్ని కొట్టేయడానికి కొరియా కంపెనీ 'పోస్కో'తో కలిసి వైసీపీ కుట్రలు చేస్తోందని ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొద్ది గంటల కిందటే తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, విశాఖ ఉక్కుపై కన్నేసిన పోస్కో బృందం 2019లో ఓసారి, 2020 లో ఓసారి తాడేపల్లిలో జగన్‌ను కలిసి చర్చలు జరిపిందంటూ ఫొటోలను సైతం ప్రదర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రజల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతలు చేసిన ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించనప్పటికీ.. బుధవారం నాడు రాజ్యసభలో కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ప్రకటన ఏపీలో చిచ్చురేపింది. తమ ఆరోపణలు నిజమేనని కేంద్రం ప్రకటనలతో తేలిపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు.

జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదు -సోనియానే మట్టికరిపించాం -కేంద్రానికి వైసీపీ వార్నింగ్ -బీజేపీ గప్‌చుప్

English summary
Union Steel Minister Dharmendra Pradhan has revealed sensational facts as a Rajya Sabha witness on the Visakhapatnam steel plant. The Union Minister as a Rajya Sabha witness revealed that POSCO was setting up a plant on the steel plant lands. Replying to a question posed by YCP MP Vijayasai Reddy, he said that an agreement was reached with the Visakhapatnam Steel Plant for the POSCO plant in October 2019. POSCO representatives said they met CM Jagan after the deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X