• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డా.సుధాకర్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. చెంచాగాళ్ల కుట్ర.. పిచ్చెవరికో సీబీఐ తేల్చుతుందంటూ..

|

''నాకిప్పుడు 74 ఏళ్లు. నా భర్త బెడ్ రిడెన్.. ఆయన్ని ఇంట్లో వదిలేసి, నా కొడుకుని చూసేందుకు ప్రతిరోజూ వస్తున్నాను. నా బిడ్డకు జరిగిన అన్యాయం.. ఏ కొడుక్కీ జరగకూడదు.. కేవలం మాస్కులు అడిడినందుకు.. ఓ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లినందుకు.. ఒక డాక్టర్ పట్ల ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం సినిమాల్లో కూడా చూడలేదు. దీని వెనుక పెద్ద కుట్ర నడిచింది. కేసులు వెనక్కి తీసుకుంటే ఉద్యోగం తిరిగిచ్చేస్తామంటూ రెండ్రోజులుగా మాకు ఫోన్లు వస్తున్నాయి. మేం మాత్రం న్యాయం కోసమే పోరాడాలని నిర్ణయించుకున్నాం. అసలు పిచ్చి పట్టింది ఎవరికో ఇక సీబీఐనే తేలుస్తుంది..'' అంటూ భావోద్వేగానికి గురయ్యారు డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిబాయి. సుధాకర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై మీడియాతో మాట్లాడిన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..

హైకోర్టు తీర్పుపై స్పందన..

హైకోర్టు తీర్పుపై స్పందన..

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియనిస్టుగా పనిచేసిన డాక్టర్ సుధాకర్ రావు.. కరోనా నియంత్రణలో ప్రభుత్వం ఫెయిలైందని, డాక్టర్లకు కూడా మాస్కులు, కిట్లు ఇవ్వడంలేదని బహరింగంగా విమర్శలు చేసి సస్పెండ్ కావడం, ఆ తర్వాత గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖపట్నంలో ప్రత్యక్షం కావడం, రోడ్డుపై గలాలా సృష్టించారన్న కారణంగా ఆయనను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం తెలిసిందే. ఈ వ్యవహారంలో వైజాగ్ పోలీసులపై కేసు నమోదు చేయాలన్న ఏపీ హైకోర్టు.. విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తీర్పుపై డాక్టర్ సుధాకర్ తల్లి హర్షంవ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న ఆమె.. సీబీఐ ద్వారానైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రాణాపాయం ఉంటుందని..

ప్రాణాపాయం ఉంటుందని..

‘‘డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న నా బిడ్డపై పిచ్చివాడని ముద్రవేశారు. ఈ పరిస్థితుల్లో వాణ్ని వదిలేసి ఇంట్లో ఎలా ఉండగలను? నేనేకాదు, ఏ తల్లయినా కొడుక్కి కష్టమొస్తే భరించలేదు. వాడి కోసం ప్రతిరోజూ ఆస్పత్రికి వస్తున్నాను. కానీ తను మాత్రం మమ్మల్ని రావొద్దంటున్నాడు. తననే అంతగా హింసినవాళ్లు.. మా ప్రాణాలకేదైనా అపకారం తలపెట్టొచ్చేమోనని భయపడుతున్నాడు. సీబీఐ వాళ్లను నేను కోరేది ఒకటే.. నా బిడ్డను మెంటల్ ఆస్పత్రి వరకు దిగజార్చడం వెనుక ఎవరెవరు ఉన్నారో అందరికీ శిక్షలు వేయాలి..''అని సుధాకర్ తల్లి అన్నారు. అసలీ వ్యవహారం ఇంతదాకా రావడానికి తనకు తెలిసిన కారణాలను ఆమె వెల్లడించారు..

జగన్ వెనకున్నవాళ్లే..

జగన్ వెనకున్నవాళ్లే..

‘‘నా కొడుకు ఎవరో టీడీపీ నాయకుడి దగ్గరికి వెళ్లాడని ఎవరైతే క్రియేట్ చేశారో.. దాన్ని బట్టే ఈ కుట్ర వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి లాంటి పెద్ద స్థానాల్లో కూర్చున్నవాళ్లు మంచిగానే ఉండొచ్చు.. కానీ ఆయన వెనకున్న చెంచాలే ఇదంతా చేయించారు. వాళ్లే.. మాస్కులు అడగటంలో నా బిడ్డ వ్యవహరించిన తీరును పెద్దదిగా చేసి ఆయనకు చూపించారు కాబట్టే విషయం ఇంతదాకా వచ్చింది. నిజానికి ఆ వీడియో కూడా వాణ్ని రెచ్చగొట్టించి మాట్లాడించారు. చిన్న చెంచాల నుంచి పెద్ద చెంచాల దాకా అందరూ కలిసి నా బిడ్డను చివరికి పిచ్చివాడిగా ముద్ర వేశారు..''అంటూ సుధాకర్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

గాయాలు రసికారుతున్నాయి..

గాయాలు రసికారుతున్నాయి..

కొందరు కావాలని తన కొడుకును రెచ్చగొట్టించి, వీడియోలు తీసి, వాటిపై రాద్ధాంతం చేశారని, ఏప్రిల్ 8న సస్పెండ్ అయినదగ్గర్నుంచి సుధాకర్ సరిగా నిద్రపోలేదని, ఆ ఒత్తిడిలో ఉండగానే.. దారినపోయే వాళ్లంతా అవమానించేసరికి తట్టుకోలేకపోయాడని అరెస్టు నాటి విషయాన్ని ఆయన తల్లి గుర్తుచేశారు. ‘‘ఒక డాక్టర్ ను పట్టకుని నడిరోడ్డుమీద ఎవడో తాగుబోతు ఏవేవో మాటలన్నాడు. పోలీసులు కూడా నా బిడ్డను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఆ గాయాలు బాగా వాచిపోయి రసికారుతోంటే తుడుచుకుంటున్నానని వాడు చెప్పినప్పుడు నా కన్నీళ్లు ఆగలేదు. నా కొడుకుతో తప్పు చేయించింది ఎవరో, రెచ్చగొట్టి మాట్లాడించి వీడియోలు తీసింది ఎవరో అన్నీ తేలాలి. కొట్టిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటే సరిపోదు.. కొట్టమని ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయో, అసలీ వ్యవహారంలో ఇంకా బయటికిరాని వ్యక్తులెవరో అందరికీ శిక్షలు పడాలి..''అని కావేరీబాయి అన్నారు.

కాంప్రమైజ్ కోసం ఫోన్లు..

కాంప్రమైజ్ కోసం ఫోన్లు..

డాక్టర్ సుధాకర్ సస్పెండ్ అయినప్పటి నుంచి బంధువులు, పరిచయస్తులు, దళిత సంఘాల ప్రతినిధులు తమ కుటుంబానికి అండగా నిలిచారని ఆయన తల్లి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా కనిపించిని అధికారులు.. రెండ్రోజులుగా ఫోన్లు చేస్తున్నారని, కేసులు వెనక్కి తీసుకుని, ప్రభుత్వానికి క్షమాపణలు చెబితే తిరిగి ఉద్యోగంలో చేరొచ్చని చెప్పారని, అయితే అందుకు తాము అంగీకరించలేదని సుధాకర్ తల్లి తెలిపారు. ముందుగా డాక్టర్ కు అన్యాయం చేసినవాళ్లకు శిక్షలు పడాలని, ఉద్యోగాన్ని తిరిగిస్తామనే విషయాన్ని అధికారులు.. తమ బంధువులు, కులసంఘాలవాళ్ల ముందుకొచ్చి తెలియపర్చాలని ఆమె కోరారు.

హైకోర్టులో వరుస షాకులు..

హైకోర్టులో వరుస షాకులు..

జగన్ సర్కారు తలపెట్టిన ప్రతి పనిపై ఎవరో ఒకరు హైకోర్టును ఆశ్రయిస్తుండటం, దాదాపు అన్ని తీర్పులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంపై టీడీపీ మహిళా ప్రెసిడెంట్ అనిత రాసిన లేఖపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత సుధాకర్ బంధువులు కూడా కేసులు ఇంప్లీడ్ అయినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు విశాఖ మెజిస్ట్రేట్.. మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న డాక్టర్ సుధాకర్ నుంచి వాగ్మూలం తీసుకున్నారు. దాన్ని పరిశీలించిన హైకోర్టు.. చివరికి విశాఖ పోలీసులపై కేసులు ఆదేశించి, దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. 8వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐకి జడ్జిలు నిర్దేశించారు. శుక్రవారం సుధాకర్ కేసుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, పంచాయితీ కార్యాలయాలకు రంగులు వ్యవహారాల్లోనూ జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి.

English summary
probe in Dr Sudhakar case, ap high court on Sudhakar casein a sensational twist in narsipatnam Doctor Sudhakar rao case, Andhra Pradesh HC orders CBI probe against vizag police on friday. Sudhakar mother kaveribai welcomes cbi probe and criticise cm jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more