విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచభూతాల్లో సగం కలుషితం..!దీర్ఘకాలం ప్రభావం చూపనున్న విశాఖ విషవాయువు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్నిలను పంచభూతాలుగా అభివర్ణిస్తాము. ఇవి సహజసిద్దంగా ఏర్పడి సకల ప్రాణులకు జీవనాధారంగా మారిపోయాయి. పంచభూతాలుగా చెప్పుకునే ఈ పంచ శక్తులను ఇప్పుడు మనిషి తన మనుగడకోసం కలుషితం చేస్తున్నాడు. పచ్చని చెట్లతో, సముద్రపు అలల గలగలలతో సస్యశ్యామలంగా, ప్రకృతి శోభతో విరాజిల్లే విశాఖ పట్టణం ఇప్పుడు కలుషిత పట్టణంగా మారిపోయింది. ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల ప్రకృతి అందించే ఫలాలను కూడా తినకూడని పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిలో దొరికే ఎన్నో త్రాగే, ఆహారాలను విషవాయువు వినాశనం చేసింది. ఇదే పరిస్థితి కొనన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితులు తలెత్తాయని వాతావరణ నివుణులు స్పష్టం చేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితిని తాకిన విశాఖ విషవాయువు..!విషాదం పట్ల స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి..!!ఐక్యరాజ్యసమితిని తాకిన విశాఖ విషవాయువు..!విషాదం పట్ల స్పందించిన ఐరాస ప్రధాన కార్యదర్శి..!!

విశాఖలో విషవాయువు తీవ్ర ప్రభావం... గాలి, నీరు, ప్రకృతి అన్ని ప్రమాదమే అంటున్న నిపుణులు..

విశాఖలో విషవాయువు తీవ్ర ప్రభావం... గాలి, నీరు, ప్రకృతి అన్ని ప్రమాదమే అంటున్న నిపుణులు..

విశాఖలో తలెత్తిన విపత్కర పరిణామాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్తితులు కనిపించడం లేదు. పండించే పంట నుండి భూగర్బంలోనిండి వచ్చే నీటి బిందువు వరకూ కలిషితమైపోయినట్టు నిపుణులు నిర్ధారిస్తున్నారు. పీల్చే గాలి మొదలు చూసే ఆకాశం వరకూ కలిషితం అయిపోయిట్టు, అవన్ని సామన్యస్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రకృతి అందించే ఎన్నో మధురాలను కూడా విషవాయువు దూరం చేసినట్టు తెలుస్తోంది. విషవాయువు వల్ల మొత్తం ప్రకృతే కాకుండా ప్రకృతి మీద ఆధారపడిన జీవకోటి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సర్వం కలుషితం.. ఏది ముట్టుకున్నా వ్యాధులు సోకడం ఖాయమంటున్న వైద్యులు..

సర్వం కలుషితం.. ఏది ముట్టుకున్నా వ్యాధులు సోకడం ఖాయమంటున్న వైద్యులు..

అంతే కాకుండా పంట పొలాలు కలుషితమవడమే కాకుండా పంటల మీద పాలిమర్ ప్రభావం ఉంటోంది. అక్కడ పండిన పంటలు తినేందుకు అనుకూలం కాదు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా పంటపొలాల్లో ఉండే బావుల్లో నీటి పరిస్థితి కూడా ఎంతొ ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. తాగడానికి, వాడకానికి అస్సలు పనికి రావని తెలుస్తోంది. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకు పోవడం గానీ, ఆ నీరు ఎండిపోవడం గానీ జరిగితే పాలిమర్ ప్రభావం తగ్గుతుంది తప్ప అప్పటివరకూ విషప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా వాయు రూపంలో స్టెరీన్ గ్యాస్ పాలిమర్ కింద మారుతోంది. పాలిమర్ జడపదార్థం. అది మనిషి శరీరంలోకి వెళితే విషవాయువును ఉత్పత్తి చేస్తోంది. ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకువస్తోందని వైద్యులు నిర్దారిస్తున్నారు.

మొన్నటివరకూ కరోనా.. నేడు విషవాయువు.. నలిగిపోతున్న విశాఖ వాసులు..

మొన్నటివరకూ కరోనా.. నేడు విషవాయువు.. నలిగిపోతున్న విశాఖ వాసులు..

ప్రస్తుతం విశాఖ నెలకొన్న పరిస్థితుల్లో కూరగాయాలు, ఆకుకూరలు, తినే పండ్లు, పెరట్లో చెట్లకు కాసిన కాయలు అస్సలు తినకూడదు. అలానే ఇంట్లో తెచ్చి పెట్టుకున్న కూరగాయాలు, మిగతా పదార్థాలు కూడ వాడకూడదు. బహిర్గతంగా ఉన్న ఆహార పదార్థాలు ఏవి తినవద్దని నిపుణులు చెప్పుకొస్తున్నారు. అలానే ఇళ్ల మీద మూత లేకుండా ట్యాంకుల్లో ఉన్న నీటితో కూడా ఎంతో ప్రమాదమని, ఆ నీటిని అస్సలు వినియోగించకూడదని తెలుస్తోంది. పాలిమర్ నీటిలో కలిసిపోతోంది. తద్వారా ఆ నీటిని తాగితే దుష్పప్రభావాలు ఉంటాయి. కిడ్నీ, లివర్, గుండె. రక్తనాళాల సమస్యలు వేగంగా తలెత్తుతాయవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

విషవాయువు ప్రభావం చాలా కాలం ఉండే అవకాశం.. దిక్కుతోచని స్ధితిలో వైజాగ్ ప్రజలు..

విషవాయువు ప్రభావం చాలా కాలం ఉండే అవకాశం.. దిక్కుతోచని స్ధితిలో వైజాగ్ ప్రజలు..

అంతే కాకుండా విషం చిమ్మిన ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ వాతావరణంలో దుమ్ము, ధూళీ పేరుకుపోయి ఉంటోందని, చేతులు కడుక్కోకుండా ముక్కు రాసుకోరాదు. కళ్లు నులుముకోవద్దని నిపుణులు చెబుతున్నారు. రిజర్వాయర్ లో నిల్వ ఉన్న నీళ్లు మొత్తం ఆవిరవ్వాలి లేదా భూమిలోకే ఇంకి పోవాలి. అప్పటివరకూ రిసర్వాయర్ నీళ్లు వాడకం గాని, జంతువులు, పక్షలు తాగినా గాని ఎంతో ప్రమాదమని తెలుస్తోంది. అంటే విషం తాలూకూ ఆనవాళ్లు పూర్తిగా రూపుమాసిపోయిన తర్వాత మాత్రమే ఉపయోగించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

English summary
The toxins emitted by LG polymers have led to the inability to eat the fruits of nature. Toxins have devastated most of the drinking and food found in nature. Weather forecasts say that the same situation has continued for years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X