విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌హిళా కార్పోరేట‌ర్ దారుణ హ‌త్య : ఇల్లు కొనేందుకు వ‌చ్చిన వారేనా : ప‌క్కా ప్లాన్ తో...!

|
Google Oneindia TeluguNews

విశాఖ న‌గ‌రంలో ఓ మాజీ మ‌హిళా కార్పోరేట‌ర్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.ఈ హత్య న‌గ‌రంలో క‌ల‌క‌లం రేపుతోంది. మాజీ కార్పోరేట‌ర్ విజ‌యా రెడ్డిని హ‌త్య చేసి బాత్ రూంలో ప‌డేసి..ఇంటికి తాళాలు వేసి దుండ‌గులు ప‌రార‌య్యారు. పోలీసులు ఈ హ‌త్య పై విచార‌ణ ప్రారంభించారు.

బాత్రూంలో శ‌వ‌మై తేలి..
విశాఖ లో మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో బాత్రూంలో శవమై తేలిన ఆమెను అపార్ట్‌మెంట్‌ కోనుగోలు చేయడానికి వచ్చినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నా రు. అక్కయపాలెం ఎన్జీఓఎస్‌ కాలనీలోని పద్మ భాస్కర అపార్ట్‌మెంట్‌లోని అయిదో ఫ్లోర్‌లో ఆమె నివాసం ఉంటున్నా రు.

ex Lady corporator murder in Vizag : polilce started enquiry

విశాఖ నగర మాజీ కార్పోరేటర్‌ అయిన విజయారెడ్డి హత్యకు గురవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి భర్త బ్యాంక్‌ ఉద్యోగి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున‍్నారు. కేసు నమోదు చేసుకుని, సీసీ టీవీ పుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టారు.

ఇల్లు కొనుగోలు చేసేందుకు వ‌చ్చి..
కాంగ్రెస్ నేత దారుణ హత్య కలకలం రేపుతోంది. అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్‌మెంటులో బాత్‌రూంలోని రక్తపు మ డుగులో విజయారెడ్డి మృతదేహం కనిపించింది. పక్కా ప్లాన్‌ప్రకారమే విజయారెడ్డి హత్య జరిగినట్టు భావిస్తున్నారు. ఇల్లు కొనేందుకు వచ్చినవారే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ హ‌త్య న‌గ‌రంలో క‌ల‌క‌లం సృష్టి ంచింది. దీని పై వెంట‌నే పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఇల్లు కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన వారు ఎవ‌రు.. వారితో గ‌తంలో విజ‌యా రెడ్డి తో ఏమైనా గొడ‌వ‌లు ఉన్నాయాన‌..హ‌త్య ఎందుకు చేయాల్సి వ‌చ్చింది... వారే నా హ‌త్య కు పాల్ప‌డింది అనే కోణంలో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు.

English summary
ex corporator Vijaya reddy murdered in Vizag city. She worked as corporation in VMC from congress party. Her dead body found in Bathroom to day morning. Police started enquiry on this murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X