• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ముద్రగడతో భేటీ అయిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ... మ్యాటర్ ఏంటో ?

|

గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి ఇప్పటివరకు జనసేన పార్టీ కార్యక్రమాలలో ఆయన పెద్దగా కనిపిస్తున్న దాఖలాలు లేవు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని, జనసేనాని ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి. ఇక తాజాగా ముద్రగడతో భేటీ కావటంతో మరోమారు ఆయనపై చర్చ సాగుతుంది.

బోటు తీయడం వారికి ఇష్టం లేదు.. అవకాశమిస్తే రెండు గంటల్లో తీస్తా.. ఓ ఎక్స్ పర్ట్ సంచలనం

 జనసేనలోనే కొనసాగుతానన్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

జనసేనలోనే కొనసాగుతానన్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని వీడుతున్నట్టు ప్రచారం జరిగిన సమయంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదని, తాను ఏం చేస్తున్నానో తనకి తెలుసని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు . రూమర్స్ రాసినవాడు ఫూల్ - ప్రచారం చేసిన వారు మూర్ఖులు - నమ్మినవాడు ఇడియట్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీకి తన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తన అవసరం ఉందని భావించినంత కాలం తాను జనసేనను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి ఆయన పార్టీ మారతారని జరిగిన ప్రచారం కేవలం రూమర్ అని ఆయన తేల్చి పారేశారు. అంతే కాదు ఇలా రూమర్లు ప్రచారం చెయ్యటం కంటే సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యాలని ట్విట్టర్ వేదికగా కోరారు.

విశాఖ ఓటర్ల మనసు గెలవలేకపోయిన మాజీ జేడీ

విశాఖ ఓటర్ల మనసు గెలవలేకపోయిన మాజీ జేడీ

సిబిఐ జెడి గా పనిచేసి ముఖ్యంగా వై ఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో దూకుడు చూపించిన లక్ష్మీ నారాయణ , రాజకీయాలపై ఆసక్తి తో ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. వి.వి లక్ష్మీనారాయణ నిజాయితీపరుడైన ఆఫీసర్ గా గుర్తింపు పొందినప్పటికీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా విశాఖ ఓటర్ల మనసు మాత్రం గెలుచుకో లేకపోయారు. దీంతో ఓటమిపాలైన ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

కాపు నేత ముద్రగడ పద్మనాభం ను కలిసిన మాజీ జేడీ

కాపు నేత ముద్రగడ పద్మనాభం ను కలిసిన మాజీ జేడీ

ఇదిలా ఉంటే అసలు వి.వి లక్ష్మీనారాయణ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ? గత ఓటమితో ఆయన రాజకీయాలను పక్కన పెట్టబోతున్నారా ? లేక సరికొత్త వ్యూహాలతో మరోమారు రాజకీయ క్షేత్రంలో ముందుకు వెళ్లనున్నారా? అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తన సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త కాపు నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన వి.వి లక్ష్మీనారాయణ ముద్రగడ పద్మనాభంతో చాలాసేపు మాట్లాడారు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన ఈ భేటీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.

ముద్రగడ ఇంటికి వెళ్లిన మాజీ జేడీకి సాదర స్వాగతం

ముద్రగడ ఇంటికి వెళ్లిన మాజీ జేడీకి సాదర స్వాగతం

అసలు ముద్రగడ ఇంటికి వివి లక్ష్మీనారాయణ ఎందుకు వెళ్లారు ? వారిద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి ? ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు ? అన్న ఆసక్తి వీరిద్దరి భేటీతో నెలకొంది. శుక్రవారంనాడు ఉన్నట్టుండి కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లిన జేడీ లక్ష్మీనారాయణకు అక్కడ ముద్రగడ అనుచరుల నుండి ఘన స్వాగతం లభించింది. ముద్రగడ ఇంట మాజీ జేడీ లక్ష్మీనారాయణ టిఫిన్ చేశారు.

 గంటకు పైగా ఏకాంతంగా చర్చలు .. రాజకీయ భవిష్యత్ గురించేనా ?

గంటకు పైగా ఏకాంతంగా చర్చలు .. రాజకీయ భవిష్యత్ గురించేనా ?

ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం, లక్ష్మీనారాయణ ఇద్దరూ గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారని సమాచారం. అయితే వీరిద్దరి చర్చ ప్రధానంగా రాజకీయాలపైన చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు పై ఇద్దరు నేతలు కలిసి ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఏదేమైనప్పటికీ గత ఎన్నికల తరువాత పెద్దగా ప్రజాక్షేత్రంలో కనిపించని మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు అన్నది తాజా భేటీతో అర్థమవుతుంది.

English summary
former CBI JD and Janasena leader VV Laxmi Narayana met a senior politician of his own community, Kapu leader, Mudragada Padmanabham, . VV Lakshminarayana, who visited the Mudragada house in the East Godavari district of Kirlampudi, spoke for an hour about the politics . the metting created curiosity among the two leaders .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more