• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చెల్లి అంటూనే రేప్ -బాలికకు గర్భం -నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ -భార్గవ్ గుట్టువిప్పన ప్రేమ్ కాజల్

|

ఫన్నీ అంశాలు, తీరొక్క స్కిట్లతో ఆకట్టుకునే వీడియోలు చేసి టిక్ టాక్ స్టార్ గా, 'ఫన్ బకెట్'నే తన ఇంటిపేరుగా మార్చుకుని, సినీరంగంలోనూ కమెడియన్ ప్రయత్నాలు చేస్తోన్న చిప్పాడ భార్గవ్ అలియాస్ టిక్ టాక్ ఫన్ బకెట్ భార్గవ్ చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. ఫన్ వీడియోలలో చోటు కల్పిస్తానని, టీవీషోలు, సినిమాల్లోనూ అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ మైనర్ బాలికను శారీరకంగా లోబర్చుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని కూడా చేసిన భార్గవ్ పై దిశ చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. కోర్టు అతనికి 14రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సంచలన వివరాలను విశాఖ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మంగళవారం మీడియాకు వివరించారు..

 కరోనా లాక్‌డౌన్: మోదీ సంచలనం -వలస కూలీలు ఎక్కడికీ కదలొద్దు -ఇకపై రాష్ట్రాలదే భారమన్న ప్రధాని కరోనా లాక్‌డౌన్: మోదీ సంచలనం -వలస కూలీలు ఎక్కడికీ కదలొద్దు -ఇకపై రాష్ట్రాలదే భారమన్న ప్రధాని

టిక్ టాక్ పరిచయం కాస్తా..

టిక్ టాక్ పరిచయం కాస్తా..


ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన చిప్పాడ భార్గవ్ టిక్‌టాక్‌ వీడియోలతో ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. అతని వీడియోల్లో తరచూ కనిపించే ‘ఓమైగాడ్' నిత్య కాకుండా వేరే అమ్మాయిలతో అతను చీకటి వ్యవహారాలు సాగించాడు. విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన ఓ 14 ఏళ్ల బాలికతో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పాపకు సైతం టిక్‌టాక్‌ వీడియోలపై ఆసక్తి ఉండటంతో తరుచూ మాట్లాడుకునేవాళ్లు. విశాఖ విజయనగరం సరిహద్దులో ఉన్న సింహగిరి కాలనీ.. భార్గవ్ గతంలో(టీవీ షోల కోసం హైదరాబాద్ రాకముందు) నివాసం ఉన్న ప్రాంతానికి దగ్గర కావడంతో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈక్రమంలో..

గంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనాగంటా భార్యను రచ్చలోకి లాగిన వైసీపీ విజయసాయిరెడ్డి -బ్లాక్ టికెట్లతో బతుకు మొదలైందంటూ బాబుపైనా

చెల్లి అని పిలుస్తూనే..

చెల్లి అని పిలుస్తూనే..

విశాఖ మైనర్‌ బాలిక.. భార్గవ్‌ను అన్నయ్య అని పిలిచేది. అతను కూడా ఆమెను చెల్లెలని పిలుస్తూనే దగ్గరయ్యాడు. ఇద్దరూ తరుచూ చాటింగ్‌ చేస్తూ, టిక్‌టాక్‌ వీడియోల పేరుతో భార్గవ్‌ ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవలె బాలిక శారీరంలో మార్పు గమనించిన ఆమె తల్లిదండ్రులు డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లగా అప్పటికే నాలుగు నెలల గర్భం అనితేలింది. ఇందుకు కారణం ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ అని ఆరోపిస్తూ బాదిత బాలిక తల్లి ఈ నెల 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించింది. మైనర్ బాలికపై అత్యాచారం, పోక్సో చట్టానికి ముడిపడిన అంశం కావడంతో ఈకేసును ​ విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది..

భార్గవ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్..

భార్గవ్ అరెస్ట్.. 14 రోజుల రిమాండ్..

ప్రేమ పేరుతో మైనర్ బాలికని శారీరకంగా అనుభవించిన టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను విశాఖ పోలీసులు చేశారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. బాలికను మాయమాటలతో లోబర్చుకుని గర్భవతిని చేసిన అభియోగాలపై భార్గవ్ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, టిక్ టాక్ భార్గవ్‌ ను హైదరాబాదులో అరెస్ట్ చేసి విశాఖపట్నం తీసుకు వచ్చామని, కోర్టులో హాజరుపర్చగా, మే 3 వరకు భార్గవ్ కు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారని, ఆ మేరకు అతణ్ని జైలుకు తరలించామని ఏసీపీ తెలిపారు. కాగా,

నగ్న వీడియోలతో బెదిరించి..

నగ్న వీడియోలతో బెదిరించి..


టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. ఆ అమ్మాయిని సోషల్ స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని ఏసీపీ కాజల్ వివరించారు.

పాపులారిటీ మోజులో మోసపోకండి..

పాపులారిటీ మోజులో మోసపోకండి..

తన టిక్ టాక్ వీడియోలు, ఫన్ స్కిట్స్ తో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన భార్గవ్ ఓ 14 ఏళ్ల బాలికను లోబర్చుకుని అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఉదంతంపై విశాఖ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో పాపులర్ చేస్తామంటే ఎవరైనా చెప్తే నమ్మి మోసపోవద్దని వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాల పట్ల పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిందితుడు భార్గవ్ పై ఇతర ఫిర్యాదులు ఉంటే బాధితులు పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ కాజల్‌ సూచించారు.

English summary
Visakhapatnam City Disha police station ACP Prem Kajal revealed sensational rape case details of Fun Bucket and tiktok fame Bhargav. accused bhargav alleggedly raped a minor girl and made her pregnant, has been arrested. Police also found that bhargav had blackmailed a minor by taking pornographic pictures with a minor as if he was giving her a chance on nearby TV channels. To this extent the accused explained that the case was registered under the posco Act along with the rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X