• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వాయువు ఎప్పుడైనా ఆయువు తీయొచ్చు..!ఇక్కడే ఉండి ఏంచేయాలి..?విశాఖ నుండి భారీ వలసలు​..!!

|

విశాఖపట్టణం/హైదరాబాద్ : కరోనా మహమ్మారి విషపు కాటునుండి పూర్తిగా కోలుకోకమందే విశాఖ వాసులను మరో విపత్తు విషవాయువు రూపంలో గజగజా వణికిస్తోంది. విషవాయువు కోరలనుండి తప్పించుకుందామనుకున్నా కరోనా కఠిన ఆంక్షల వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో దిక్కుతోచని సంకటస్థితిలోపడడ్డారు విశాఖ వాసులు. అయినప్పటికి ఎప్పటికయినా ఆయువు తీసే విషవాయువుకు దూరంగా పారిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు విశాఖ వాసులు. ఇల్లు వాకిలిని వదిలేసి ప్రణాలుకాపాడుకునేందకు సుదూరప్రాంతాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. పిల్లా పాపలను తీసుకుని, కొద్దిపాటి సామాన్లతో వలసబాట పడుతున్నారు విశాఖ వాసులు.

  Vizag Gas Leak : People Leaving Visakhapatnam Due To Fear Of Gas Leak

  విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రానికి, రాష్ట్రానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు

  ప్రశాంత పట్టణం విషాద పట్టణంగా మారింది.. వలస వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న విశాఖ వాసులు..

  ప్రశాంత పట్టణం విషాద పట్టణంగా మారింది.. వలస వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న విశాఖ వాసులు..

  విశాఖపట్టణం ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అసలే కరోనా భయంతో బయట సర్వం బందైన సందర్బాలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా బయటకు వెళ్తే కరోనా వైరస్ కాటేస్తుందని భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో విషపు గాలి విశా: వాసులను తరిమికొడుతోంది. మొండిగా అక్కడే ఉన్నచోట ఉంటే విషైపు వాయువు చంపేస్తుందని మరో భయం. కరోనా వస్తే బతికి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ విష వాయువు వల్ల ఊపిరితిత్తులు పనిచేయకపోవచ్చు, క్యాన్సర్ రావచ్చు. ఇంక ప్రణాలకే ప్రమాదం పొంచి ఉండి ఉండవచ్చు. అందుకే విషవాయువుతో పోల్చుకుంటే కరోనా పెద్ద ప్రమాదం కాదని భావిస్తున్న విశాఖ వాసులు విలువైన వస్తువులు, లగేజీ తీసుకుని విశాఖపట్నం ప్రజలు శ్రీకాకుళం, విజయనగరం వైపు వలసలు పోతున్నారు.

  వలస వెళ్లేందేకు పోలీసుల ఆంక్షలు.. విసిగిపోతున్న విశాఖ ప్రజలు..

  వలస వెళ్లేందేకు పోలీసుల ఆంక్షలు.. విసిగిపోతున్న విశాఖ ప్రజలు..

  విశాఖలో పరిస్థితి మొత్తం తెలిసిన పోలీసులు వలస వెళ్తున్న అబాగ్యులను అడ్డుకోవడం శోచనీయమనే చర్చ జరుగుతోంది. పైడి భీమవరం చెక్ పోస్టు వద్ద కార్లు, ద్విచక్రవాహనాలు అన్నీ ఆపేస్తున్నారు. ఈ వలస వెళ్లే వారిలో అత్యధికులు ఎల్జీ పాలిమర్స్ కు ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలే. విష వాయువు విజృంభణతో ఇళ్లలో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయని, బంధువుల వద్దకు వెళ్లి కొన్ని రోజులు ప్రాణాలు కాపాడుకుంటామని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. అయితే క్వారంటైన్లో ఉంటే పంపిస్తామని పోలీసులు షరతులు విధించడం విస్మయానికి గురి చేస్తోందని వలస వెళ్తున్న వారు చెప్పుకొస్తున్నారు.

  మొన్నటి వరకూ.. నిన్న విషవాయువు.. అయోమయంలో విశాఖ వాసులు..

  మొన్నటి వరకూ.. నిన్న విషవాయువు.. అయోమయంలో విశాఖ వాసులు..

  కాగా గట్టిగా నిలదీస్తే క్వారెంటైన్ సాకు చెబుతున్నారని, గట్టిగా అడగలేని వారిని తిరిగి వెనక్కు పంపేస్తున్నారని వలస ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు చొరవతీసుకోరని, తమ జాగ్రత్తలు కూడా తమని తీసుకోనివ్వకుండా విషవాయువుకు బలి కావాలా అంటూ తమ బాధను వెళ్లగక్కుతున్నారు వలస జనాలు. ఇదిలా ఉండగా ఎల్జీ పాలిమర్స్ మృతుల సంఖ్య శుక్రవారానికి పన్నెండుకి పెరిగింది. నిన్న అర్ధరాత్రి మరోసారి విషవాయువు విడుదల కావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగిందని తెలుస్తోంది.

  మా ప్రాణాలను మమ్మల్ని కాపాడుకోనివ్వడి... పోలీసులకు మొరపెట్టుకుంటున్న వైజాగ్ జనాలు..

  మా ప్రాణాలను మమ్మల్ని కాపాడుకోనివ్వడి... పోలీసులకు మొరపెట్టుకుంటున్న వైజాగ్ జనాలు..

  ఇప్పటికే విశాఖ ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. స్వల్ప అస్వస్థత ఉన్నవారిని ఎక్కడ పడితే అక్కడ పెట్టి చికిత్స అందిస్తున్నారు. కానీ బంధువులకు సరిగా సమాచారం చేరవేయకపోవడంతో తమ వాళ్లు ఎక్కడున్నారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల మద్య బిక్కుబిక్కుమంటూ బ్రతికే కన్నా సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రణాలు కాపాడుకోవాలని భావిస్తున్నారు విశాఖ వాసులు. పరిస్తితులు మొత్తం తెలిసిపోయినప్పటికి పోలీసులు మొండిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎలాంటి సాయం డిమాండ్ చేయకుండా తమ జీవితాలు తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకోవడం విచారకరమని విశాఖ వలస వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Visakha residents have always tended to run away from the life-threatening toxins. They have to leave the driveway of the house and travel to far-flung places. Visakha residents are taking their children and emigrating with little baggage.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X