• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ లో గ్యాస్ లీకేజ్ .. భయంతో కార్మికుల పరుగులు, తాజా పరిస్థితి

|

విశాఖ జిల్లాలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. విశాఖ జిల్లాలోని హెచ్పీసీఎల్ లో గ్యాస్ లీక్ కావడంతో కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ లీక్ అయిన వెంటనే సైరన్ మోగడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు . గ్యాస్ లీకేజ్ జరుగుతుందని గుర్తించిన అధికారులు దానిని వెంటనే అదుపుచేసే ప్రయత్నం చేశారు. లీకేజీని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి లీకేజ్ ను కంట్రోల్ చేసింది.

విశాఖ హెచ్పిసీఎల్ లో గ్యాస్ లీకేజ్ ఘటన .. యాజమాన్యం చెప్పిందిదే

ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు కానీ గ్యాస్ లీకేజ్ ఘటన ఒక్కసారిగా కార్మికుల్లో భయాందోళనకు కారణమైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వందలాది సంఖ్యలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం విశాఖ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో యధావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లుగా యాజమాన్యం వెల్లడించింది. ఇక గ్యాస్ లీక్ కు గల కారణాలపై సంస్థ పరిశీలన జరుపుతుంది. విశాఖలో ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నుండి నేటి వరకు ఎప్పుడు ఎక్కడ గ్యాస్ లీక్ ఘటనలు జరిగినా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన నుండి నేటివరకు గ్యాస్ లీక్ అంటేనే భయం

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన నేటికీ ఎల్జీ పాలిమర్స్ పరిసర గ్రామాలలో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూనే ఉంది. విశాఖలోని వెంకటాపురం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ లో 2020, మే ఏడవ తేదీన గ్యాస్ లీక్ కావడంతో 15 మంది చనిపోగా, వందల సంఖ్యలో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . నేటికీ అక్కడ వారి పరిస్థితులు దయనీయంగా నే ఉన్నాయి. విష వాయువుల వల్ల అక్కడి ప్రజలు చాలా మంది దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఏ చిన్న గ్యాస్ లీక్ ఘటన జరిగినా ఏపీ ఉలిక్కి పడుతున్న పరిస్థితి ఉంది.

ఇటీవల విశాఖ ఫార్మా సిటీలో విష వాయువుల లీకేజ్ .. ఆందోళనలో స్థానికులు

మొన్నటికి మొన్న విశాఖ ఫార్మాసిటీలో విషవాయువుల లీకేజీ ఘటనను మర్చిపోకముందే తాజాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది. మొన్న విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలో ఓ ఫార్మా కర్మాగారం నుండి విషవాయువులు లీక్ అయిన ఘటనస్థానిక ప్రజలకు ఆందోళన కలిగించింది.విశాఖ జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ఫార్మా కంపెనీ నుండిరసాయన విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పరుగులు తీశారు.

సమీప గ్రామాల ప్రజల ఆందోళన .. ఫార్మా కంపెనీపై చర్యలకు డిమాండ్

సమీప పరిశ్రమలలో ఉన్న కార్మికులు కూడా విష వాయువుల ధాటికి ఉక్కిరిబిక్కిరై పరుగులు తీశారు.కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలోఇబ్బందులతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. ఇక ఫార్మా సమీపంలో ఉన్న తాడి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు కంపెనీ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఫార్మా కంపెనీ వల్ల తమ ప్రాణాలకు హాని వాటిల్లుతుందని, అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఫార్మా కంపెనీలు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలను రక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.

  Spl Interview with bjp Mahila leaders on Viewers day
  English summary
  Gas leakage has created tension at the Hindustan Petroleum Corporation limited in Visakhapatnam district. Workers were at once alarmed by a gas leak at HPCL in Visakhapatnam district. As soon as the gas leaked the siren sounded and the workers ran out. Authorities noticed a gas leak and immediately tried to contain it. Firefighters rushed to the scene to control the leak.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X