విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారి ప్రాణాలు తీసిన మొబైల్ ఫోన్... పేరెంట్స్ జాగ్రత్త..! ఇదొక హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కరోనావైరస్ నేపథ్యంలో దేశం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో పెద్దలతో పాటు పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఇళ్లలోనే ఉండి బయటకు వెళ్లలేక స్మార్ట్ ఫోన్లపై పడుతున్నారు. కొన్నిసార్లు మొబైల్ ఫోన్‌ ఇవ్వకపోతే తల్లిదండ్రులనే ఎదిరిస్తున్న ఘటనలు కూడా చూశాం. తాజాగా ఓ 15 ఏళ్ల చిన్నారి మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

 మొబైల్ ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య

మొబైల్ ఫోన్ ఇవ్వలేదని బాలిక ఆత్మహత్య

విశాఖ జిల్లా భీమిలిలో నివాసముంటున్న 15 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్ కోసం తన సోదరుడితో గొడవకు దిగింది. మొబైల్ ఫోన్ ఇవ్వకపోవడంతో ఆ బాలిక గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ చిన్నారి బంగారు భవిష్యత్తుకు బ్రేకులు వేసింది. అయితే ఆత్మహత్యలు సహజమే అని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆత్మహత్యకు కారణం మొబైల్ ఫోన్ అనేది గ్రహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్‌ ఇస్తున్న ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు. దేశంలో లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పిల్లలు ఒంటరిగా ఫీలవుతున్నారన్న వాస్తవాన్ని విస్మరించలేము. అయితే దానికి ప్రత్యామ్నాయం మరొకటి ఆలోచించాలి కానీ .. ఇలా స్మార్ట్ ఫోన్‌ను చేతికి ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.

లాక్‌డౌన్ సమయంలో స్మార్ట్ ఫోన్లకు పిల్లలు అడిక్ట్

లాక్‌డౌన్ సమయంలో స్మార్ట్ ఫోన్లకు పిల్లలు అడిక్ట్


ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు కావాలంటూ గొడవ పడని ఇళ్లు లేదా పిల్లలంటూ లేరు. అయితే పిల్లలు ఈ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో కలుగుతోంది.అంతేకాదు ఇంటర్నెట్‌కు కూడా అలవాటు పడిపోయిన పిల్లలు ఫోన్లలో ఎలాంటి సైట్లు చూస్తున్నారో అనేదానిపై కూడా తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా వరకు కార్పొరేట్ స్కూళ్లు లాక్‌డౌన్ సమయంలో మొబైల్ యాప్స్ ద్వారా పిల్లలకు కొన్ని యాక్టివిటీస్ అసైన్ చేశాయి. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు వారి టీచర్లు ఇచ్చిన టాస్క్‌లు పూర్తిచేయడమే కాదు... మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో పిల్లల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని వైద్యులు చెబుతున్నారు.

Recommended Video

Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases
పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందంటున్న వైద్యులు

పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందంటున్న వైద్యులు

రోజంతా ఇంట్లోనే ఉంటున్న పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ లేదాటాబ్‌లపైనే గడుపుతున్నారు. బయటికెళ్లి స్నేహితులతో ఆడుకోలేని పరిస్థితే ఇందుకు కారణం. దీంతో మొబైల్‌ ఫోన్‌కు మరింత దగ్గరవుతున్నారు. అదే సమయంలో స్కూలు టీచర్లు మొబైల్ యాప్స్ ద్వారా అసైన్‌మెంట్లు ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టలేమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పిల్లలకు డిజిటల్ లెర్నింగ్ పేరుతో యాప్స్ ద్వారా టాస్కులు ఇవ్వడం టీచర్లు మానుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ సమయంలో పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలకే మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఒక వేళ ఇచ్చినా క్లాసులు అయిపోగానే మొబైల్ ఫోన్లను వారినుంచి తీసుకోవాలని పేరెంట్స్‌కు సూచిస్తున్నారు వైద్యులు.

English summary
A 15-year girl committed suicide afer quarrelling with her brother over a mobile phone
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X