• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రధానమంత్రి అవార్డ్స్ రేసులో గ్రేటర్ విశాఖ .. స్వచ్చత- ప్రజల భాగస్వామ్యంపై టాప్ 10 నగరాల పోటీ

|

విశాఖ మహా నగరం స్వచ్చ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు 2020 రేసులో నిలిచింది. స్వచ్ఛతతో మెరిసిపోతున్న విశాఖ నగరం తాజాగా ప్రధానమంత్రి అవార్డు కోసం ఎంపిక చేసిన పది జిల్లాల జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణాది రాష్ట్రాల తరఫున ఎంపికైన ఏకైక జిల్లాగా నిలిచింది విశాఖ. విశాఖ జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు కలిపి ఒక క్లస్టర్ గా పోటీలో పాల్గొన్నాయి.

ఏపీ బాటలో..మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు: కేటీఆర్ కీలక ప్రకటన

స్వచ్చ సర్వేక్షన్ లో 9వ స్థానంలో విశాఖ

స్వచ్చ సర్వేక్షన్ లో 9వ స్థానంలో విశాఖ

స్వచ్ఛ సర్వేక్షన్ లో ఈ సంవత్సరం 14 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచిన విశాఖ స్వచ్ఛత లో టాప్ 10 మహానగరాల చెంత నిలిచింది. స్వచ్ఛత ప్రమాణాలను పాటిస్తూ, తడి చెత్త, పొడి చెత్త లను విభజిస్తూ, చెత్త నుండి ఎరువు ను తయారు చేస్తూ చెత్తరహిత నగరంగా విశాఖ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఇప్పుడు ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక చేసిన టాప్ టెన్ మహానగరాలలో విశాఖ స్థానాన్ని పొందింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధానమంత్రి అవార్డు కోసం విశాఖ మహానగరం పోటీ పడుతోంది.

ప్రజల భాగస్వామ్యం , అవగాహనపై పోటీ

ప్రజల భాగస్వామ్యం , అవగాహనపై పోటీ

ఈ పోటీలో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రత, స్థానిక సంస్థలు అందించే సేవలు, చెత్త విభజన, ప్రజలకు కల్పించే అవగాహన కార్యక్రమాలు, వ్యక్తిగత పరిశుభ్రత, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం మొదలైన అంశాలలో ప్రజల అవగాహన, భాగస్వామ్యం ఎలా ఉంది అన్న దానిపై పోటీ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటుగా, నర్సీపట్నం ,యలమంచిలి మున్సిపాలిటీలు కలిపి జిల్లా యుఎల్ బి క్లస్టర్ గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీలో నిలిచాయి. అక్కడి ప్రజల యాక్టివ్ పార్టిసిపేషన్ మీద అవార్డు సాధించటం ఆధారపడి వుంది .

 స్వచ్చతలోనూ , ప్రజల అవగాహనలోనూ ముందు వరుసలో విశాఖ

స్వచ్చతలోనూ , ప్రజల అవగాహనలోనూ ముందు వరుసలో విశాఖ

రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ నగరంలోని యూజర్ ఫ్రెండ్లీ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ లోనూ, చెత్త నుంచి విద్యుత్ తయారీలోనూ, భవన నిర్మాణ వ్యర్ధాల నిర్వహణ విషయంలోనూ విశాఖ ముందంజలో ఉంది. విశాఖ స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం తో పాటు విశాఖలోని నాయకులు, పరిశ్రమలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛ అంబాసిడర్లు , నౌకాదళం పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని గ్రేటర్ విశాఖ అధికారులు చెబుతున్నారు.

  Nutan Naidu: శిరోముండనం ఘటన తర్వాత Bigg Boss Fame నూతన్ చేసిన మరిన్ని మోసాలు వెలుగులోకి...
  ఈ నెలాఖరుకు విన్నర్ ఎవరో తేలనున్న నేపధ్యంలో విశాఖ వాసుల ఆత్రుత

  ఈ నెలాఖరుకు విన్నర్ ఎవరో తేలనున్న నేపధ్యంలో విశాఖ వాసుల ఆత్రుత

  ప్రమోటింగ్ పీపుల్స్ మూమెంట్ జన భగీరథి పేరుతో ఈ అవార్డులను అందించనున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి విశాఖపట్నం గట్టి పోటీ ఇస్తుంది. దక్షిణాది నుండి ఏకైక జిల్లాగా ఉన్న విశాఖ అవార్డును సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ప్రధానమంత్రి అవార్డు ఫలితాలు ఈ నెలాఖరులో విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ వాసులు, అవార్డు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

  English summary
  The Prime Minister's Award 2020, organized by the Swachha Bharat Mission, Visakhapatnam, across the country, has been shortlisted. The city of Visakhapatnam, which is shining with neatness, has recently made it to the list of ten districts selected for the Prime Minister's Award. Visakhapatnam was the only district selected on behalf of the southern states. Three urban local bodies in Visakhapatnam district participated in the competition as a cluster.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X