విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌..చంద్రబాబు పీఏలుగా : ఎన్నిక‌ల వేళ‌..కొత్త దందా: ఎమ్మెల్యేల‌ ల‌బోదిబో..!

|
Google Oneindia TeluguNews

కాదేదీ మోసానికి అన‌ర్హం. తాజాగా ఏపీలో ఎన్నిక‌ల వేళ హెటెక్ మోసంతో ఏకంగా ముఖ్యమైన రాజ‌కీయ నేత‌ల‌నే బురిడీ కొట్టించారు ఆ ఘ‌రానా మోస‌గాళ్లు. ప్ర‌ధాన పార్టీల నుండి టిక్కెట్లు ఆశిస్తున్న వారిని ల‌క్ష్యంగా చేసుకొని ఈ కేటు గాళ్లు ప్లాన్ చేసారు. ఇందులో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా గెలిచిన వ్య‌క్తి సొమ్ము న‌ష్ట‌పోయారు. ఈ వ్య‌వ‌హారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఓ ప్ర‌ధాన నిదితుడు ఒక ఏఏస్సీ కుమారుడు. మొత్తం న‌లుగురిని ఈ వ్య‌వ‌హారంలో అరెస్ట్ చేయ‌గా.. ఆస‌క్తి క‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

స్పూఫ్ కాల్స్‌తో బురిడీ..

స్పూఫ్ కాల్స్‌తో బురిడీ..

విశాఖ‌లోని ఓ ఏఎస్సై కుమారుడు సాగ‌ర్‌. బీటెక్ మ‌ధ్య‌లోనే మానేసిన సాగ‌ర్ వ్య‌స‌నాల‌కు బానిస అయ్యాడు. స్పూఫ్ కాల్స్‌తో తేలిగ్గా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చ‌ని ఆలోచ‌న చేసాడు. దీని కోసం త‌న స్నేహితులైన రౌడీ షీటర్ గంధవరపు తరుణ్‌కుమార్‌ (30), పెదగంట్యాడకు చెందిన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ పీ జయకృష్ణ(24), శ్రీహరిపురానికి చెందిన మరడాన జగదీశ్‌(24)తో కలిసి ప్లాన్ అమ‌లుకు ప్ర‌య‌త్నించాడు. మే 7న అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పీఏ శ్రీనివాసరావు నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి సీఎంగారు రూ.10లక్షలు పంపించమ న్నారని... మీకు విదేశీ నంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది, వారికి అందజేయాలి అని చెప్పాడు. కొంతసేపటికే వేరేనంబర్‌ నుంచి ఫోన్‌చేసి శ్రీనివాస్‌ మీ నంబర్‌ ఇచ్చారని, తాము స్టీల్‌ప్లాంట్‌ వద్ద వున్నామని చెప్పారు. నిజమేనని భావించిన బండారు తన డ్రైవర్‌ ద్వారా రూ.10లక్షలు పంపించారు.

టీడీపీ..వైసీపీ నేత‌ల‌కు ట్రాప్‌..

టీడీపీ..వైసీపీ నేత‌ల‌కు ట్రాప్‌..

తొలి ప్ర‌య‌త్నంలోనే ప‌ది లక్ష‌లు ద‌క్క‌టంతో మిగిలిన నేత‌ల‌తోనూ ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకోసం టీడీపీ .. వైసీపీ నేత‌ల‌ను ఎంపిక చేసుకున్నారు. వారిలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎంపీ మురళీమోహన్‌, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి,కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్‌, సుష్మాస్వరాజ్‌కు కూడా ఫోన్‌ చేసినా వాళ్లెవరూ నమ్మలేదు. వైసీపీ నేతలకు జగన్‌ పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడినట్టు అతని నంబర్‌ నుంచి పలాస ఎమ్మెల్యే అప్పలరాజు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, వైసీపీ పిఠాపురం సమన్వయకర్త దొరబాబు, హర్షవర్ధన్‌రెడ్డికి ఫోన్‌ చేసి డబ్బు సర్దాలని అడిగాడు. వారిలో ప‌లాస నుండి వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసి నేడు ఎమ్మెల్యే అయిన అప్పలరాజు మాత్రం నిజ‌మే అని న‌మ్మి 15లక్షలను మర్రిపాలెంలోని అన్న క్యాంటీన్‌ వద్ద ఆ ముఠాకు అందజేశారు.

విస్తుపోయిన పీఏలు..వాళ్లు ఇలా దొరికిపోయారు..

విస్తుపోయిన పీఏలు..వాళ్లు ఇలా దొరికిపోయారు..

ఇలా కాల్స్ వ‌స్తుండంతో కొంత‌మంది వైసీపీ..టీడీపీ నేత‌లు నేరుగా అధినేత‌ల పీఏల‌కు ఫోన్ చేసి వాక‌బు చేసారు. దీంతో..జ‌గ‌న్ పీఏ నాగేశ్వ‌ర రెడ్డి అటువంటింది ఏమీ లేద‌ని చెప్ప‌టంతో నేత‌లు షాక్ అయ్యారు. తాము మోస‌పోయామ ని గ్ర‌హించిన నేత‌లు విశాఖ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు, అప్పలరాజు కాశీబుగ్గలో, సుబ్బరాజు ముమ్మిడివరంలో, హర్షవర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం 570 డివై్‌సలు, 7వేల ఫోన్‌కాల్స్‌ ఐపీ నంబర్లను గుర్తించిన విశాఖ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు నిందితుల‌ను అదులోకి తీసుకున్నారు. వారి నుండి 5.8 లక్ష‌ల న‌గ‌దు..28 గ్రామ‌లు బంర‌గా స్వాధీనం చేసుకున్నారు. విశాఖ‌లో ఇటువంటి హైటెక్ మోసాల‌తో ఏకంగా ప్ర‌జా ప్ర‌తినిధులే మోస పోవ‌టం ఇప్పుడు సామాన్యుల్లో చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

English summary
Hi tech robbery taken place in Visakha city. Some of the TDP and YCP mlas becaem victims in this case. With spoof calls collected money from leaders at last caught by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X