విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ మరో శ్రీనగర్, శ్రీ బాగ్ ఒప్పందం మేరకే కర్నూలులో హైకోర్టు, కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల ఏర్పాటుపై జీఎన్ రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. రాజధానుల గురించి కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సుబ్బారావు మీడియాకు తెలియజేశారు. అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మంత్రుల నివాసా సముదాయాలు ఉంటాయని..విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు.

 మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు కావాలి .. రాజధాని మహిళల మండిపాటు

సమ్మర్ క్యాపిటల్

సమ్మర్ క్యాపిటల్

వేసవిలో విశాఖపట్టణంలో అసెంబ్లీ నిర్వహించడానికి గల కారణం కూడా కమిటీ సభ్యుడు సుబ్బారావు వివరించారు. అమరావతిలో ఎండల వేడి ఉన్నందున వేసవి తాపం తట్టుకొనేందుకు విశాఖలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించాలని సూచించినట్టు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలా నిర్వహించేవారో గుర్తుచేశారు. కశ్మీర్, శ్రీనగర్‌లో వేసవి, శీతకాలంలో రాజధానులుగా పరిగణించేవారని తెలిపారు. ఇప్పుడు అలాగే విశాఖలో కూడా సమ్మర్ అసెంబ్లీ నిర్వహించుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు చెప్పారు. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసు, సమ్మర్ అసెంబ్లీ ఉండాలని సజెస్ట్ చేసినట్టు తెలిపారు. విశాఖపట్టణంలో సమ్మర్ అసెంబ్లీ నిర్వహించడంతో ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధికి నోచుకుంటుందని తెలిపారు. ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తోందని చెప్పారు.

శ్రీ బాగ్ ఒప్పందం..

శ్రీ బాగ్ ఒప్పందం..

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్ అని ప్రొఫెసర్ సుబ్బారావు తెలిపారు. కానీ ఆచరణకు నోచుకోలేదని చెప్పారు. 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం అమలు కాలేదని గుర్తుచేశారు. శ్రీ బాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టుతోపాటు అనుబంధ కోర్టులు కూడా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసినట్టు చెప్పారు.

సమతుల్యం కోసం

సమతుల్యం కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అసమానతలకు గురవుతుందని చెప్పారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ఆ ప్రాంతమే డెవలప్ అవుతుందని సుబ్బారావు గుర్తుచేశారు. గత 60 ఏళ్ల నుంచి చేసిన అభివృద్ధి ఒక్క హైదరాబాద్‌కే పరిమితమైందని పేర్కొన్నారు. అన్నీ ప్రాంతాలకు సమతుల్యంగా పథకాలు, అభివృద్ధి జరగాలని కమిటీ భావించిందని చెప్పారు. ఏపీ ఆర్థికలోటు ఇబ్బంది పడుతోందని.. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు అవసరమవుతాయని గుర్తుచేశారు. విశాఖలో సమ్మర్ అసెంబ్లీ ఏర్పాటు చేయడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పారు. ఇప్పటికే ఇక్కడ కంపెనీలు, విద్యాసంస్థలు, విమానాశ్రయం, నౌకాశ్రయం ఉందని గుర్తుచేశారు. విశాఖ నగరంలోపాటు ఉత్తర కోస్తాంధ్ర ప్రజలకు మేలు జరుగుతుందని ప్రొఫెసర్ సుబ్బారావు తెలిపారు.

అభివృద్ధి బాట

అభివృద్ధి బాట


రాయలసీమ ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ప్రాంతీయ అసమానతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 10 వేల 600 కిలోమీటర్లు తిరిగి నివేదిక రూపొందించినట్టు పేర్కొన్నారు. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేయడం కాదన్నారు.

English summary
highcourt in kurnool, summer capital vizag committee member subbarao said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X