విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ నేవీలో హనీట్రాప్: 12 మంది అధికారుల అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

పాపిస్థాన్ వైఖరి మారలే. దేశ రక్షణ రహస్యాలను కొల్లగొట్టడానికి దేనికి అయినా వెనకాడటం లేదు. డబ్బులు.. లేదంటే అమ్మాయిలును పంపి సీక్రెట్స్ రాబడుతోంది. నేవీలో జరిగిన కుట్ర వెలుగులోకి వచ్చింది. కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ-(ఎన్ఐఏ) విచారిస్తోంది. మనీ ట్రాప్‌లో కొందరు నేవీ అధికారులను అరెస్టు చేసింది. పాక్ పన్నిన వలలో చాలామంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మరో 12మందిని అదుపులోకి తీసుకుంది.

హానీట్రాప్..

హానీట్రాప్..

పాకిస్తానీ ఏజంట్ల గూఢచర్యం దర్యాప్తును కొనసాగిస్తున్న ఎన్ఐఏ 2020లో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. గుజరాత్‌ గోద్రా, మహారాష్ట్ర బుల్దానాతోపాటు ఏపీలోని విశాఖలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. గుజరాత్, మహారాష్ట్రలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపారు. కీలక సూత్రధారి యాకూబ్ గిటేలి, ముగ్గురు ఏజంట్లతోపాటు 12 మంది నేవీ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రానిక్‌ డివైజర్స్‌, సిమ్‌కార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారత నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ ఏజంట్లు గూఢచర్యానికి పాల్పడ్డారు. యువ నేవీ అధికారులను ఐఎస్ఐ ఏజంట్లు మనీట్రాప్ చేశారు. నేవీ అధికారులతో ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని వాళ్ల కదలికలు తెలుసుకున్నారు. నౌకలు, సబ్ మెరైన్లు, నేవీ ఉన్నతాధికారులకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు.

 ఆపరేషన్ డాల్పిన్ నోస్

ఆపరేషన్ డాల్పిన్ నోస్


అనుమానం వచ్చిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు 'ఆపరేషన్ డాల్ఫిన్ నోస్' పేరుతో దర్యాప్తు చేపట్టారు. గూఢచర్యం బయటపడటంతో 12 మంది యువ నేవీ అధికారులను, ఐఎస్ఐ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొందరు నేవీ సెయిలర్స్‌ పాత్రకూడా ఉన్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. భారత నేవీ సిబ్బందికి ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిల్ని ఎర వేసింది. ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్‌ వీడియోలు తీస్తుంది. ఐఎస్ఐ నేరుగా రంగంలోకి దిగి.. ఆ వీడియోలతో ట్రాప్‌లో చిక్కుకున్న వారిపై బెదిరింపులకు దిగుతుంది. నౌకాదళ సమాచారం సేకరిస్తోంది. భారత నిఘా వర్గాలకు సమాచారం అందడంతో ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌ పేరుతో రహస్య విచారణ చేపట్టారు.

పాక్ వెన్నులో వణుకు

పాక్ వెన్నులో వణుకు


విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం అంటే శత్రు దేశాల వెన్నులో వణుకు. 1971లో పాకిస్తాన్‌లో గల కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర తూర్పు నౌకా దళానిది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబరులో సాగర తీరంలో నేవీ డే నిర్వహిస్తారు. పలు యుద్ధనౌకల విన్యాసాలతో విశాఖ తీరం పులకిస్తుంది. అలాంటిది ఇక్కడి అధికారులను ట్రాప్ చేసింది. అమ్మాయిలు.. దానికి లొంగకుంటే డబ్బులు ఇచ్చి సమాచారం సేకరించింది. ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రమత్తం కావడంతో.. వెంటనే వారిన అదుపులోకి తీసుకోగలిగారు.

English summary
honeytrap: vizag 12 officilas are arrested by NIA. pakistan isi blackmailed them with nude videos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X