విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ దట్టమైన పొగలు వచ్చాయి. ఒక్కసారిగా భారీ మొత్తంలో తెల్లని పొగలు ఆకాశంలోకి రావడంతో ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం వాసులు భయాందోళనలకు గురయ్యారు.

huge smoke into sky from a industry: Visakhapatnam people feared.

అంతా ఇళ్ల నుంచి బయటికి వచ్చి మళ్లీ ఏం జరిగిందోనంటూ ఆందోళన చెందారు. అయితే, కొంత సేపటికి పొగ తీవ్రత తగ్గిపోవడంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై హెచ్‌పీసీఎల్ యాజమాన్యం స్పందించింది.

రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచే క్రమంోల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గుర్తించి, వెంటనే పరిస్థితిని సరిచేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఎలాంటి పొగ రావడం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Recommended Video

VizagGasLeak: Venkatapuram Villagers Dharna At LG Polymers Demanding Job for Every Family in Village

కాగా, ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 200 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో దట్టమైన పొగలు రావడంతో విశాఖ వాసులను మరోసారి ఆందోళనకు గురిచేసింది.

English summary
huge smoke into sky from a industry: Visakhapatnam people feared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X