విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొడగొట్టి, మీసం మేలేసిన అయ్యన్నపాత్రుడు: దమ్ముంటే సీఎం జగన్ అని, పంచాయతీ ఎన్నికల్లో..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. 59 శాతం రిజర్వేషన్ పెట్టడం వెనక కుట్రకోణం ఉంది ఆయన మండిపడ్డారు. 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కేటాయిస్తే కోర్టు బ్రేకులు వేస్తోందని ఉదహరించారు. అందుకోసమే తెలివిగా రిజర్వేషన్లు పెంచి ఖరారు చేశారని ఫైరయ్యారు.

50 శాతం..

50 శాతం..

పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. అప్పడు తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని తొడగొట్టీ మరీ సవాల్ విసిరారు. మెజార్టీ సీట్లు గెలిచి తమంటే ఏంటో నిరూపించుకుంటామని చెప్పారు. కానీ 59 శాతం రిజర్వేషన్ పెట్టడం.. టీడీపీపై నిందలు వేయడానికేనని ఆరోపించారు.

నక్కజిత్తుల వేషాలు

నక్కజిత్తుల వేషాలు

7 నెలల పాలనలో ఏం చేశారో ప్రజలు చూశారని సీఎం జగన్‌ను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు అన్నారు. నక్కజిత్తుల వేషాలు తమకు తెలుసు అని, కుట్రకోణం ఉంది అని ముందే గుర్తించామని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్లు మించరాదు.. అలాంటప్పుడు 59 శాతం ఎలా ఖరారు చేస్తారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఒకవేళ కోర్టు స్పందిస్తే స్టే ఇవ్వమని కోరితే నెపం తమపై నెడతారా అని మండిపడ్డారు.

తొడకొట్టి, మీసం మేలేసీ..

తొడకొట్టి, మీసం మేలేసీ..


వాస్తవానికి టీడీపీ ధర్మం, న్యాయం ప్రకారం నడుచుకుంటుందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. వైసీపీ నాయకులు, సీఎం జగన్‌ చేస్తోన్న ఆరోపణలతో టీడీపీ నేతలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మన దమ్ము ఏంటో చూపించాల్సిన అవసరం వచ్చిందని.. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కోరారు. 50 శాతం రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తే.. తెలుగు తమ్ముళ్లు సత్తా చాటుతారని మీసం మేలేసీ మరీ చెప్పారు.

English summary
if you have courage 50% reservation after conduct panchayat poll ex minister ayyannapatrudu .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X