విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1978లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కూడా..: నాలుక కరచుకున్ననారా లోకేష్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. మున్సిపల్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తోన్నారు. దీనికోసం ఆయన ఈ ఉదయం విశాఖపట్నానికి వచ్చారు. తొలుత- సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాజువాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీ రోడ్ షో నిర్వహించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సహా పలువురు పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మండదా: తప్పు విష్ణుదే: తేల్చేసిన రఘురామ: విశాఖ రాజధాని ఉత్తుత్తిదేపెయిడ్ ఆర్టిస్ట్ అంటే మండదా: తప్పు విష్ణుదే: తేల్చేసిన రఘురామ: విశాఖ రాజధాని ఉత్తుత్తిదే

తొలి రోడ్ షో

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోలో నారా లోకేష్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో విశాఖపట్నం టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. గాజువాక సహా ఆయన రోడ్ షో, సభలను నిర్వహించే ప్రాంతాలను పసుపు జెండాలతో నింపేశారు. ఒకవంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవంక తెలుగుదేశం అభ్యర్థుల ఎన్నికల ప్రచార కోలాహలంతో సాగరనగరం హీటెక్కింది. పోటాపోటీ ప్రచారాలతో రెండు పార్టీల నేతలు దూసుకెళ్తోన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచిపెడుతున్నారు.

నారా లోకేష్ తడబాటు..

తొలి రోడ్ షోలో నారా లోకేష్ తడబడ్డారు. అనంతరం సర్దుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంపై మాట్లాడుతోన్న సమయంలో ఆయనలో ఈ తడబాటు కనిపించింది. 1978లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నారని నారా లోకేష్ చెప్పారు. ఇక్కడే ఆయన పొరబడ్డారు. నిజానికి- వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నది 1998లో. ఇదే విషయాన్ని పక్కనే ఉన్న పార్టీ నాయకులు సూచించారు. అది 1978 కాదని, 1998 అని చెప్పారు. దీనితో నారా లోకేష్ తన పొరపాటును సరిదిద్దుకున్నారు. 1998గా ఉచ్ఛరించారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తోన్నారు.

ప్రైవేటీకరణను అడ్డుకున్నాం..

ప్రైవేటీకరణను అడ్డుకున్నాం..


వాజ్‌పేయి ప్రభుత్వంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకోగలిగిందని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు చేసిన సూచనలు, తీసుకొచ్చిన ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని చెప్పారు. అలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు, వ్యూహాలను జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేకపోతోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేయడానికి ముఖ్య కారకుడు జగనేనని ఆరోపించారు. ఏడు వేల ఎకరాల మేర ఉక్కు ఫ్యాక్టరీ భూములపై ఆయన కన్నేశారని మండిపడ్డారు.

నాలుగు రోజుల పాటు విస్తృత పర్యటనలు..

నాలుగు రోజుల పాటు విస్తృత పర్యటనలు..

కాగా- ఈ నెల 8వ తేదీ వరకు నారా లోకేష్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనబోతోన్నారు. నాలుగు రోజుల పాటు ఆయన పలు ప్రాంతాల్లో ఎన్నికల సభలు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. శుక్ర, శనివారాల్లో విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నారా లోకేష్ ప్రచారం చేస్తారు. 7వ తేదీన మండపేట, పిఠాపురం, 8వ తేదీన మచిలీపట్నం, పెడనలోనూ నారాలోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో నారా లోకేష్, దక్షిణాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు.

English summary
Telugu Desam Party leader Nara Lokesh once again slips his tongue as Atal Bihari Vajpayee was Prime Minister of India at 1978. He correct it after party leaders suggested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X