విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లికి అనుమానం, టార్చర్ : తండ్రిపై కూతురి దాడి, మృతి

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : చేయిపట్టుకొని పెంచిన తండ్రి చేష్టలతో విసిగిపోయింది. సహజీవనం చేస్తోన్న మహిళ మాటలు విని అమ్మతో నాన్న ప్రవర్తిస్తోన్న తీరుతో మదనపడింది. తల్లిని అనుమానిస్తూ .. హింసిస్తుంటే చూడలేక తండ్రిపై దాడి చేసి మట్టుబెట్టింది. కన్నతండ్రి హత్యకేసులో నిందితురాలై ఊచలు లెక్కబెడుతుంది ఆ యువతి.

పెళ్లైన ఆరేళ్లకే ..

పెళ్లైన ఆరేళ్లకే ..

విశాఖపట్టణం కంచరపాలెం రవీంద్ర నగర్ కు చెందిన సముద్రయ్య రైల్వేలో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. 1995లో నాగలక్ష్మితో వివాహం కాగా .. వారికి అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. పెళ్లైన ఆరేళ్ల నుంచి రమణమ్మ అనే వివాహితతో సముద్రయ్య సహజీవనం చేస్తున్నాడు. ఇంట్లో గొడవలతో ఆమెను తీసుకొని కొన్నాళ్లు ఒడిశా కూడా వెళ్లిపోయాడు. మూడేళ్ల విధులక దూరంగా ఉండటంతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి రావడంతో నాగలక్షీ సూచన మేరకు రమణమ్మను తీసుకొచ్చి వచ్చి మళ్లీ విధుల్లో చేరాడు.

ఆగని గొడవలు

ఆగని గొడవలు

తిరిగి ఉద్యోగంలో చేరినా గొడవలు ఆగలేదు. తన ఖర్చుల కోసం భరణం ఇవ్వాలని నాగలక్షి 2012లో కేసు వేసింది. తర్వాత భర్తతో కాంప్రమైజ్ తనతో భర్తను ఉండనిచ్చింది. తర్వాత కూడా సముద్రయ్య భార్య, పిల్లలను నెగ్లెక్ట్ చేశాడు. రమణమ్మ మాటలు విని .. నాగలక్ష్మీని టార్చర్ చేసేవాడు. ఇటీవల డ్వాక్రా ద్వారా వచ్చిన రూ.4 వేలతో కూతురుకు నాగాలక్షీ బట్టలు కొనడం పాపమైంది. దీనిపై రమణమ్మ సముద్రయ్యకు చాడీలు చెప్పడంతో డబ్బులు ఎక్కడివీ, ఎవరితో తిరుగుతన్నావు అని గొడవపడ్డాడు.

తండ్రిపై దాడి, మృతి

తండ్రిపై దాడి, మృతి

భార్య, కూతురుపై ఆగ్రహం వ్యక్తం చేసి .. దూషించి వెళ్లిపోయాడు. రాత్రి వచ్చి భార్యపై దాడి చేశాడు. ఈ క్రమంలో కూతురు అడ్డుకుంది. తండ్రిని చెంపదెబ్బలు కొట్టింది. దీనిపై కోపంతో కూతురుపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన కూతురు వంటగదిలో ఉన్న కత్తితో తండ్రిపై దాడిచేసింది. దీంతో అతడు వెంటనే ప్రాణాలు విడిచాడు.

English summary
samudraiah is working railway fitter in Visakhapatnam. In 1995, he married Naga laxmi and they have a girl and a boy. he will be cohabited with the name of Ramanamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X