విశాఖలో దారుణం ... భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ దాడి
విశాఖ నగరంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ భర్త భార్యపై యాసిడ్ పోసి దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లిని కాపాడడానికి వెళ్లిన కుమార్తె కూడా గాయపడింది. విశాఖ లోని శివాజీ పాలెంలో ఈశ్వర రావు అనే వ్యక్తి పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య దేవి, కుమార్తె గాయత్రి ఉన్నారు. మద్యానికి బానిసైన ఈశ్వర్ రావు కు భార్యపై అనుమానం. ఆ అనుమానమే భార్యపై యాసిడ్ పోసేదాకా వెళ్ళింది.
మచిలీపట్నంలో వైసీపీ నేత కుమారుడిపై హత్యాయత్నం ... చేసింది ఎవరంటే
భార్య ఇతరులతో చనువుగా ఉంటుందన్న అనుమానంతో నిత్యం తరచూ ఇంట్లో గొడవలు పడేవాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం భార్య దేవిపై ఈశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. ఆమెపై యాసిడ్ పోశాడు. తల్లిని కాపాడడం కోసం ఈశ్వరరావు కుమార్తె గాయత్రి ప్రయత్నించగా ఆమెకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే బాత్ రూమ్ క్లీనింగ్ కు ఉపయోగించే యాసిడ్ పోయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. మద్యానికి బానిస అయిన ఈశ్వర్ రావు 500 రూపాయలు అడిగాడు.

డబ్బుల కోసం ఈరోజు ఉదయం భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవలో భార్యపై అనుమానంతో నానా దుర్భాషలాడుతూ ఆమెపై హత్యా యత్నానికి పాల్పడిన ట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన దేవిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, గృహ హింస చట్టం ద్వారా కఠిన శిక్షలు వివిధ నేరాలకు అమలవుతున్నా మగాళ్ళ వైఖరి లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. చిన్నచిన్న విషయాలకే భార్యలను హతమార్చడం, దాడులకు పాల్పడడం, హింసించడం నిత్యకృత్యంగా మారాయి.