విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుతల్లి విగ్రహం నుంచి జనసేన లాంగ్ మార్చ్: ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రారంభం కానుంది.

ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభం కానున్న ఈ లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ నుంచి రామాటాకీస్, ఆశిల్ మెట్టల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జీవీఎంసీ బిల్డింగ్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటుంది.

janasena long march will start form telugu thalli statue in visakha

అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లాంగ్ మార్చ్ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే వాహనాలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది.

హత్తుకునేలా 'నాకు అడిగే హక్కుంది': ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)హత్తుకునేలా 'నాకు అడిగే హక్కుంది': ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)

'గుంటూరు జిల్లాలో గత నెల రోజుల్లోనే ఐదుమంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు.. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు నిలిచి పనులు దొరకని పరిస్థితి.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో భవన నిర్మాణ కూలీ గుర్రం నాగరాజు.. పొన్నూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి.. తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో తాపీ మేస్త్రీ నాగ బ్రహ్మాజి.. గుంటూరు గ్రామీణ మండలంలోని గోరంట్లలో ప్లంబర్ పోలేపల్లి వెంకటేష్.. చేబ్రోలు మండలం వేజెండ్ల నాగూర్ వలి' అంటూ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.


కాగా, నవంబర్ 3న విశాఖపట్నంలో నిర్వహించి జనసేన లాంగ్ మార్క్‌కు పోలీసుల నుంచి అనుమతి లభించిందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొందరు కావాలనే సభకు అనుమతి లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేనని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్‌లో పాల్గొనాలంటూ వివిధ పార్టీల అధినేతలకు కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.

English summary
janasena long march will start form telugu thalli statue in visakha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X