విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ‌లో జేడీ..! పెరిగింది రాజ‌కీయ వేడి..!!ఎవ‌రికి చిక్కుతుందో ఓట‌ర్ల నాడి..!!

|
Google Oneindia TeluguNews

అయ‌రావ‌తి/హైద‌రామాద్ : సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ ల్లో ఇప్పుడు సంచ‌ల‌న రాజ‌కీయ నేత‌. సొంత‌పార్టీ స్థాపిస్తార‌ని అంద‌రూ ఊహించిన త‌రుణంలో జేడీ మాత్రం ఆ ప‌ని చేయ‌లేదు. ఒక‌సారి తెదేపాలో చేర‌తార‌ని, మ‌రోసారి లోక్‌స‌త్తా అని, కాదు కాదు సొంత పార్టీ పెడ‌తార‌ని.. ఇలా ర‌క‌ర‌కాల ఊహాగానాల త‌ర్వాత జ‌న‌సేన‌లో చేరిపోయారు. ఆయ‌న్ను విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ స్థానం నుంచి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రంగంలోకి దింపారు. వాస్త‌వానికి ఆయ‌న్ను అనంత‌పురం లేదా కాకినాడ నుంచి బ‌రిలోకి దించాల‌ని ప‌వ‌న్ భావించారు. దీనివ‌ల్ల రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ ఓట్ల‌కు గండి కొట్ట‌వ‌చ్చ‌ని గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌ణాళిక రచించారు. కాకినాడ నుంచి పోటీ చేస్తే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో పార్టీకి ప్ల‌స్ అవుతుంద‌ని కూడా భావించారు.

మా నాన్న హత్య కేసులో మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నారు. : వైఎస్ వివేకా కుమార్తె <br>మా నాన్న హత్య కేసులో మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నారు. : వైఎస్ వివేకా కుమార్తె

అయితే అఖరి నిమిషంలో మార్పు జ‌రిగింది. విశాఖ‌ప‌ట్నం నుంచి ఓ పారిశ్రామిక‌వేత్త పోటీ చేయాల్సి ఉండ‌గా గెలుపుపై ధీమా లేక‌పోవ‌డంతో ఆయ‌న పోటీ చేయ‌న‌ని ప‌వ‌న్ చెప్పేశారు. అదే స‌మ‌యంలో కాకినాడ లేదా అనంత‌పురం కంటే విశాఖ‌ప‌ట్నంలో పోటీ చేస్తాన‌ని ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తి వ్య‌క్తం చేశార‌ట‌. విశాఖ‌లో ఉద్యోగులు, అక్ష‌రాస్యులు ఎక్కువ‌గా ఉన్నారు. ఐటీ ఉద్యోగుల ఓట్లు 30 నుంచి 40వేల వ‌ర‌కు ఉన్నాయి.

JD in vishakha politics..! Political heat increased..! whom will find voters pulse..!!

ఫార్మా కంపెనీల రాక‌తో ఆయా కంపెనీల ఉద్యోగులు పెద్ద‌సంఖ్య‌లో ఉన్నారు. ఉద్యోగుల ఓట్లుకార‌ణంగా త‌న గెలుపు సులువు అవుతుంద‌ని ల‌క్ష్మీనారాయ‌ణ భావించారు. దీనికి ప‌వ‌న్ కూడా ఒప్పుకోవ‌డంతో విశాఖ బ‌రిలో నిలిచారు. మ‌రి రేపు ఓట‌ర్ల‌ను జేడి ఎంత‌వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తార‌నేది చూడాలి.

English summary
Ex-CbI JD Laxminarayana, now a sensational political leader in AP Jedi did not do the job while everyone thought he would own the party. Once in Tdp, once again the Loksatta, or not the own party will go to .. After so many speculation, he joined Janaena. Janasana chief Pawan Kalyan gave him Vishakhapatnam Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X