విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకసభ ఎన్నికలు 2019: విశాఖపట్నం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

By Staff
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : Visakhapatnam Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది.

విశాఖపట్నం వైజాగ్ గా పిల‌వ‌బ‌డే ఈ ప్ర‌దేశం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు కంటే ముందే గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం ఇదే. బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయింది.

ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వారిలో 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డిరాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీలు, మొగలులు, హైదరాబాదు నవాబులు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు. 1950 ఆగస్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది.

#LokSabhaElection2019: All about Visakhapatnam Constituency

విశాఖపట్నం బంగాళా ఖాతము నానుకొని సముద్రపు ఒడ్డున ఉంది. విశాఖపట్నానికి ఎల్లలు; ఉత్తరాన ఒడిషా రాష్ట్రము మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా గలదు. తూర్పున బంగాళాఖాతము, మరియు పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి. జనాభా పెరుగుదల కారణంగా 1981లో 180 మురికి వాడలున్న విశాఖపట్నంలో 2011 సంవత్సరానికి 650 పైగా మురికి వాడలు ఉన్నాయి. వీరికి ఉండటానికి చోటు లేక, సిండియా నుంచి గాజువాక వరకూ వున్న పారిశ్రామిక ప్రాంతంలోని కొండల మీద నివాసం ఉంటున్నారు. అలాగే కప్పరాడ, మధురవాడ ప్రాంతాలలోని కొండల మీద నివాసాలు పెరిగాయి. వీరంతా వలస వచ్చిన వారే. జ‌నాబా అనూహ్యంగా పురుగుతుండ‌డంతో వర్యావరణ సమస్యలు, కొండల మీద పచ్చదనం అంతరించి పోవటం జరుగు తుంది.

రాజ‌కీయంగా విశాఖ ప‌ట్ట‌ణం ఎప్పుడూ త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంటుంది. ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతున్న విశాఖ ప‌ట్ట‌ణం లో రాజ‌కీయ చైత‌న్య కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. తాము ఓటు వేసి గెలిపించిన ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌నితీరును సునిశితంగా గ‌మ‌నించ‌డం అక్క‌డ ప్ర‌జ‌ల ప్ర‌త్యేక‌త‌గా చెప్పొచ్చు. ప్ర‌జా సంక్ష‌మం కోసం ప‌ని చేయ‌ని నాయ‌కుడిని ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలు చేయ‌డం అక్క‌డి ప్ర‌జ‌ల మ‌రెఓ ప్ర‌త్యేక‌త‌. అందుకే అక్క‌డ రాజ‌కీయ‌లు శ‌ర‌వేగంగా మారుతుంటాయి.

విశాఖ లోక్ స‌భ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వివ‌రాల‌ను ఒక‌సారి చూద్దాం. శృంగవరపుకోట, భీమిలి, తూర్పు విశాఖపట్నం, దక్షిణ విశాఖపట్నం, పశ్చిమ విశాఖపట్నం, ఉత్తర విశాఖపట్నం తో పాటు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఇక మొద‌టి నుచీ లోక్ స‌భ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివ‌రాల‌ను ఒక సారి చూద్దాం. మొదటి సారి 1952-57 లో లంక సుందరం, గాము మల్లుదొర స్వ‌తంత్య్ర అభ్య‌ర్థులుగా గెలుపొంద‌గా, రెండవ సారి 1957-62లో పి.వి.జి.రాజు సోషలిస్ట్ పార్టీ నుంచి గెలుపొందారు. మూడవ సారి 1962-67లో విజయ్ ఆనంద కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంద‌గా, నాల్గవ సారి 1967-71లో తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్ నుండి గెఓలుపొందారు. ఇక ఐదవ సారి 1971-77లో పి.వి.జి.రాజు కాంగ్రెస్ నుండి గెల‌వగా, ఆరవ సారి 1977-80లో ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. ఏడవ సారి 1980-84 లో కె.అప్పలస్వామి కాంగ్రెస్ ప‌ర్టీ నుంచి గెల‌వ‌గా, ఎనిమిదవ సారి 1984-89లో భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు.

తొమ్మిదవ సారి 1989-91లో ఉమా గజపతిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెల‌వ‌గా, ఐదవ సారి 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఇక పదకొండవ సారి 1996-98లో టి.సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నుంచి గెల‌వ‌గా, 12వ సారి కూడా ఆయ‌నే కాంగ్రెస్ నుండి గెలిచారు. పదమూడవ సారి 1999-04లో ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ గెలుపొంద‌గా, పదునాల్గవ సారి 2004-09లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక పదిహేనవ సారి 2009-14లో దగ్గుపాటి పురందరేశ్వరి కాంగ్రెస్పార్టీ నుంచి గెల‌వ‌గా, పదిహారవ సారి 2014-19 వ‌ర‌కు కంభంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిద్యం వ‌హిస్తున్నారు.

మ‌హా విశాఖ ప‌ట్ట‌ణం తీర‌ప్రాంతంలో ఉన్న‌ప్ప‌టికి ఆశించిన అభింవ్రుద్ది మాత్రం అంత వేగంగా జ‌ర‌గ‌లేదు. ఇప్పుడిప్పుడే న‌గ‌రానికి సాఫ్ట్ వేర్ కంనెనీలు రావ‌డం, నాగ‌రిక‌త‌వైపు ప‌రుగులు తీయ‌డం, భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని చాటుకోడం జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచం గ్లోబ‌లైజేష‌న్ దిశ‌గా ప‌ర్య‌టిస్తున్న త‌రుణంలో విశాఖ ప‌ట్ట‌ణం కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశాగా అడుగులు వేస్తోంది.

స‌ముద్ర తీర‌పు చ‌ల్ల గాలుల మ‌ద్య ఉండే విశాఖ ప‌ట్ట‌ణం రాజ‌కీయంగా మాత్రం వేడిగా ఉంటుంది. ఓ పార్టీ పై మ‌రో పార్టీ పై చేయి సాధించుకునేందుకు ఎత్తుల‌కు పైఎత్తులు వేసుకుంటుంటారు రాజ‌కీయ నాయ‌కులు. విశాఖ ప‌ట్ట‌ణంలో క‌మ్మ సామాజిక ఉన్న‌ప్ప‌టికి కాపు సామాజిక వ‌ర్గానిదే వైచేయి గా నిలుస్తుంటుంది. ఆ త‌ర్వాత మ‌త్స్య‌ కారులు ఎక్కువ‌గా రాజ‌కీయాలను ప్ర‌భావితం చేస్తుంటారు. పారిశ్రామిక వేత్త‌లు కూడా ఎక్కువ‌గా ఉన్న విశాఖ‌లో మ‌హిళలు కూడా రాజ‌కీయ చైత‌న్యాన్ని క‌న‌బ‌రుస్తుంటారు.

పర్యాటకం:-

సింహాచలం ఆలయం

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, పలు పర్యాటక స్థలాలు, పుణ్యక్షేత్రాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో కోటి 78 లక్షల మంది పైచిలుకు, 2016లో రెండుకోట్ల 6 లక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా. 2016, 2017 సంవత్సరాల్లో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో విశాఖపట్టణం జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతోంది. విదేశీ పర్యాటకులు అత్యధికులు సందర్శించిన జిల్లాల్లో 2016, 2017ల్లో రెండో స్థానం నిలబెట్టుకుంది.

సింహాచలం - శబరీ వరాహ లక్ష్మీ, నరసింహ స్వామి దేవాలయం.
డాల్ఫిన్స్ నోస్ (డాల్ఫిన్ చేప ముక్కులాగ వుంటుందని, ఈ కొండకు, ఆ పేరు పెట్టారు). 174 మీటర్ల ఎత్తులో, సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండమీద ఉన్న లైట్ హౌస్, సముద్రంలో ప్రయాణిస్తున్న నావికులకు, దారి చూపుతుంది. యాత్రికులు ఈ లైట్ హౌస్‌ను చూడవచ్ఛు. ఈ కొండ మీద నౌకాదళ సిబ్బందికి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ కొండ దిగితే, యారాడ అనే గ్రామం కనిపిస్తుంది. అరటి, కొబ్బరి పంట పొలాలతో పచ్ఛని పొలాలతో ఈ పల్లె కనిపిస్తుంది. కనకాంబరాలు కూడా ఇక్కడ పండిస్తారు.

రామకృష్ణ బీచ్ - విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్. చాలా సుందరమైనది. సముద్రపు కోత వలన, బీచ్ విస్తీర్ణం తగ్గింది. ఈ ప్రాంతంలో, దేశ నాయకుల విగ్రహాలు, ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు. ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం, రామకృష్ణా మిషన్, హవా మహల్, జలాంతర్గామి (కల్వరి) మ్యూజియం ఉన్నాయి. భారత దేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు

రిషికొండ బీచ్ - నగరానికి 8కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ పర్యాటక శాఖ, పున్నమి రిసార్టులను వర్యాటకులకు అద్దెకు ఇస్తుంది. ఇక్కడి సముద్ర తీరం స్నానాలు చేయటానికి సురక్షితమైన చోటుగా చెప్పుకుంటారు.

English summary
Lok Sabha Election 2019: Know detailed information on Visakhapatnam Lok Sabha Constituency of Andhra Pradesh. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X